కృష్ణ

పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా 2019 సాధారణ ఎన్నికల్లో ప్రదర్శించిన జట్టుతత్వాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఉద్యోగులకు సూచించారు. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల 2019 సమాయత్త సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 2019 సాధారణ ఎన్నికలు జిల్లాలో ఉద్యోగులందరి సహకారంతో ఒక జట్టుగా పనిచేసి ప్రశాంతంగా నిర్వహించామన్నారు. జిల్లాలోని 970 పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా ఈ నెల 30వ తేదీకి ఓటరు జాబితాను ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు గుర్తించడానికి సమాయత్త సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. మే నెల 10లోపు ఓటరు జాబితా సిద్ధం కావాలని, ఉద్యోగులంతా శిక్షణలో భాగంగా మాస్టర్ ట్రైనర్స్ చెప్పిన విషయాలు అనుసరించాలన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఓటర్ల సంఖ్య గతంలో కంటే పెరిగేలా చేశామన్నారు. ఓటరు జాబితా సిద్ధం చేయడంలో కొత్త ఓటర్లను కలపడం గానీ, తీసివేయడం గాని, మార్పులు చేయడం గాని చేయరాదన్నారు. గత మార్చి 25న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటరు జాబితా ప్రకారం సిద్ధం చేయాలని, ఇదంతా రొటేషన్ ప్రకారం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. డీపీఓ రవీంద్ర మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు తేడా ఉంటుందని, పంచాయతీ ఎన్నికల్లో ఓటున్న ప్రతి వ్యక్తి వివరాలు ఆ గ్రామస్తులకు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్-2 పీ బాబూరావు, సబ్ కలెక్టర్లు మీషా సింగ్, స్వప్నిల్ దినకర్, సీఈవో సలాం, డీఆర్వో ఏ ప్రసాద్, గుడివాడ ఆర్డీవో సత్యవాణి, తదితరులు పాల్గొన్నారు.