కృష్ణ

కౌంటింగ్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): ఎన్నికల కమీషన్ నియమ, నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీ కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కౌటింగ్ ప్రక్రియ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని గుడివాడ ఆర్డీవో, రిటర్నింగ్ అధికారిణి గుత్తుల వెంకట సత్యవాణి అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో రెండువ రోజు నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీ నమూనా ఓట్ల లెక్కింపు శిక్షణకు హాజరైన సూపర్‌వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు గుడివాడ ఆర్డీఓ, ఆర్‌ఓ జివి సత్యవాణి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ వేరు వేరుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ చేస్తారన్నారు. ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుండి 22 రౌండ్ల వరకు ఉంటాయన్నారు. ప్రతి టేబుల్‌పై కంట్రోలు యూనిట్‌తో పాటు బ్యాలెట్ యూనిట్ కూడా ఉంటుందన్నారు. బ్యాలట్ యూనిట్ కంట్రోలు యూనిట్‌కు అనుసంధానం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. అలా లెక్కించిన ఓట్లను అభ్యర్థి వారీ నిర్ణీత ప్రొఫార్మాలో నింపి అన్ని రౌండ్లు పూర్త అయిన తదుపరి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినవి గణించి తుది ఫలితంగా పరిగణించి సంబంధిత నియోజకవర్గం ఆర్‌ఓ అబ్జర్వరు దృష్టికి తీసుకువెళతారని సత్యవాణి వివరించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి పోస్టల్ బ్యాలెట్లను అభ్యర్థులు ఆవరీ వేరుచేసి 25 చొప్పున కటక్టలు కట్టి వారి కేటాయించిన ర్యాంక్‌లో ఉంచుతారన్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఆయా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా ఐదు వీవీ ప్యాట్లను ఎంపిక చేసి వివి ప్యాట్లలో ఉన్న స్లిప్‌లను అభ్యర్థులు వారీ వేరు చేసి 25చొప్పున కట్టలు కట్టి వారి కేటాయించిన ర్యాంక్‌లో ఉంచుతారన్నారు. కౌంటింగ్ విధి విధానాల పట్ల విధులు నిర్వహించి అధికారులు, సిబ్బంది పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని, పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమూనా కౌంటింగ్ పై ఈనెల 21న మరో విడత శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 22న ర్యాండమైజేషన్ పద్దతి ద్వారా నియోజకవర్గాల వారీ సిబ్బందికి కౌంటింగ్ విధులు కేటాయిస్తారని తెలిపారు. ఈనెల 23 ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారి కేటాయించిన నియోజకవర్గాల వారీ విజయవాడ ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో, మచిలీపట్నం కృష్ణా యూనివర్శిటీలోని కౌంటింగ్ కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బందరు తహశీల్దార్ సునీల్‌బాబు, ఘంటసాల తహశీల్దార్ సీత, ఆర్డీఓ ఆఫీసు ఎఓ చంద్రశేఖర్, డీటీ సుభాష్, డీఎస్‌టీఓ రజనీబాబు తదితరులు పాల్గొన్నారు.
వట్టిపోయన చెరువులు!

మైలవరం, మే 15: ప్రస్తుత పరిస్థితులలో చెరువులు ఎండిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ ప్రజా సంఘాలు, రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఆయన మైలవరం మండలంలోని గణపవరం, తోలుకోడు, వెల్వడం చెరువులను నాయకులతో కలసి పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ సాగరు జలాలు రాక, వర్షాలు పడక గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఈ ప్రభావం భూగర్భజలాలపై పడి బావులు, బోర్లు సైతం మోరాయిస్తున్నాయన్నారు. అదేవిధంగా పొలాల్లో పశువులకు తాగునీటి ఎద్దడి ఉందన్నారు. సాగరు జలాలను తక్షణమే విడుదల చేయించి చెరువులను నింపి తాగునీటి ఎద్దడిని నివారించాలన్నారు. ఇటీవల జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ నిధులు కౌలు రైతు ఖాతాల్లో వెంటనే జమచేయాలని, రైతులకు ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పధకం కింద ఎకరాకు పదివేల రూపాయన నగదును జూన్ మొదటి వారంలోనే రైతుల ఖాతాలకు జమచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలను ఉచితంగా అందించాలని, రైతు దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ నాయకులు సీహెచ్ కోటేశ్వరరావు బుడ్డి రమేష్, బుద్ధారపు వెంకట్రావ్, ఉప్పు నరసింహారావు, అజ్మీర భీముడు, ఎలీషారావు, నానిక్య, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.