కృష్ణ

మార్కులు కలపడం మానేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు 10వ తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు కలిపే విధానాన్ని తొలగించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఉప కమీషనర్ ఎంవి కుమారస్వామి తెలిపారు. స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్ పరీక్షల్లో 80 మార్కులకే పేపర్ ఉంటుందని, 10 మార్కులు సమ్మెటివ్-1 ద్వారా, ఎఫ్‌ఎసీ ద్వారా పది మార్కులు విద్యార్థులకు కలుపుతుండటంతో మిగిలిన 15 మార్కులతో వారు ఉత్తీర్ణత కావటంతో విద్యా ప్రమాణాలు తగ్గుతున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు గుర్తించిందన్నారు. దీంతో రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్నల్ మార్కులు కలిపే విధానాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సబ్జెక్టులో 100 మార్కుల పేపర్ ఉంటుందని, అందులో 35 మార్కులు వస్తే పాస్ అవుతారని, హిందీలో 20 మార్కులు తప్పని సరిగా పొందాల్సి ఉంటుందన్నారు. 10వ తరగతిలో10/10 జీపీఎ సాధించిన విద్యార్థులను మాజీ రాష్టప్రతి ఏపీజె అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాలను అందచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో గత ఏడాది కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. అలాగే పరీక్షలు సందర్భంగా విద్యార్థులకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్‌ఎస్‌సీ బోర్డు ముందుగానే విద్యాశాఖకు సూచనలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా డెప్యూటీ కమీషనర్ కుమార స్వామిని ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్ తరపున ఏలేశ్వరపు ఫణికుమార్ దుశ్శాలువాలతో సత్కరించారు. ఆలయ అర్చకులు పెనుమూడి బాబూరావు శ్రీ బాలాత్రిపుర సుందరి, శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమూడి రాకేష్, పసుమర్తి రామకృష్ణ, ఉత్తమ ఉపాధ్యాయిని భాగవతుల హేమలత, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.