కృష్ణ

‘పది’లో వెనుకబడ్డ ‘సర్కారు’ బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘పది’ ఫలితాల్లో సర్కారు బడులు వెనుకబడ్డాయి. గత ఏడాది సర్కారు బడుల్లో గణనీయంగా పెరిగిన ఉత్తీర్ణత ఈ సంవత్సరం అంతకు అంత పడిపోయింది. జిల్లాలో ప్రైవేట్ మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో గత సంవత్సరం 93.62 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ సంవత్సరం 90.94 శాతానికి పడిపోయింది. 2.68 శాతం తగ్గింది. గత సంవత్సరం 4.4శాతం పెరిగిన ఉత్తీర్ణత ఈ సంవత్సరం 2.68కి తగ్గింది. పది ఫలితాల్లో జిల్లా 93.96 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే తొమ్మిదవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. జిల్లా ఉత్తీర్ణతతో పోల్చి చూసినా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత అంతంత మాత్రమనే చెప్పాలి. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 55వేల 397 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరు కాగా 52వేల 52 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి 2వేల 147 మంది విద్యార్థులకు గాను 28వేల 180 మంది ఉత్తీర్ణులై 96.68శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. వివిధ యాజమాన్యాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన ఉత్తీర్ణతా శాతం పరిశీలిస్తే 999.62 శాతం ఉత్తీర్ణతతో ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. 261 మందికి గాను 260 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత స్థానాన్ని 97.06 శాతం ఉత్తీర్ణతతో కెజీబీవీ (కస్తూరిబా గాంధి బాలిక వికాస కేంద్రాలు) విద్యార్థులు నిలిచారు. 102 మంది విద్యార్థులకు గాను 99 మంది కృతార్ధులయ్యారు. జెడ్పీకి సంబంధించి 92.61 శాతం ఉత్తీర్ణతతో 18వేల 252 మందికి 16వేల 904 మంది కృతార్ధులయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 843 మందికి గాను 719 మంది ఉత్తీర్ణులు కాగా 85.29 శాతం నమోదైంది. పురపాలక సంఘ ఉన్నత పాఠశాలల్లో 2వేల 706 మందికి గాను 2వేల 339 మంది కృతార్ధులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 86.44గా నమోదైంది. ఎయిడెడ్ పాఠశాలల్లో 2వేల 778 మందికి గాను 2వేల 331 మంది కృతార్ధులై 83.91 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బీసీ సంక్షేమ వసతి గృహాలకు 33 మందికి గాను 33 మంది ఉత్తీర్ణులై నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ సాంఘీక సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి 1054 మందికి గాను 976 మంది ఉత్తీర్ణులవ్వగా ఉత్తీర్ణతా శాతం 92.6గా నమోదైంది. ఏపీ గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి 84 మందికి గాను 78 మంది కృతార్ధులు కాగా 92.86గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏపీ మోడల్ స్కూల్స్‌కు సంబంధించి 132 మందికి గాను 128 మంది ఉత్తీర్ణులవ్వగా 96.97గా ఉత్తీర్ణతా శాతం నమోదైంది.

ఫర్వాలేదనిపించిన జీపీఏ
జీపీఎ (10/10) సాధనలో మాత్రం ప్రభుత్వ పాఠశాలలు ఫర్వాలేదనిపించాయి. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 203 మంది విద్యార్థులు జీపీఎ సాధించగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 247 కు పెరగడం అభినందనీయం. మున్సిపల్ పాఠశాలు, బీసీ హాస్టల్స్‌లో జీపీఎ తగ్గగా మిగిలిన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో జీపీఎ పెరిగింది. జిల్లా పరిషత్, హైస్కూల్స్‌లో గణనీయంగా జీపీఎ పెరిగింది. జెడ్పీ హైస్కూల్స్‌కు సంబంధించి గత సంవత్సరం 121 మందికి గాను ఈ సంవత్సరం 154 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం 10 మంది జీపీఎ సాధించగా ఈ సంవత్సరం 16 మంది సాధించారు. మున్సిపల్ పాఠశాలల్లో గత సంవత్సరం 41 మంది జీపీఎ సాధించగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 34కు పడిపోయింది. అలాగే బీసీ వెల్ఫేర్‌కు సంబంధించి గత సంవత్సరం నలుగురు జీపీఎ సాధించగా ఈ సంవత్సరం కేవలం ఒకరు మాత్రమే జీపీఎ సాధించారు. ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి మాత్రం గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 31 మంది జీపీఎ సాధించారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం నలుగురుకి ఈ సంవత్సరం ఆరుగురు, ఏపీ సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి గత సంవత్సరం ఒకరికి గాను ఈ సంవత్సరం నలుగురు జీపీఎ సాధించారు. మోడల్ స్కూల్‌కు సంబంధించి గత సంవత్సరం ఎవ్వరూ జీపీఎ సాధించలేదు. కానీ ఈ సంవత్సరం ఒక విద్యార్థి మోడల్ స్కూల్స్ నుండి జీపీఎ సాధించడం విశేషం.

నూరు శాతం ఫలితాల్లో వెనుకబాటు
నూరు శాతం ఫలితాల సాధనలోనే ప్రభుత్వ బడులు వెనుకబడ్డాయి. గత సంవత్సరం 173 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలను రాబట్టిన విద్యా శాఖ ఈ సంవత్సరం కేవలం 165 పాఠశాలలకే పరిమితం కావడం విమర్శలకు దారి తీస్తోంది. గత సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎనిమిది పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు తగ్గాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు గణనీయంగా తగ్గాయి. గత సంవత్సరం 13 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించగా ఈ సంవత్సరం కేవలం రెండు పాఠశాలలతో సరి పెట్టుకోవల్సి వచ్చింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌కు సంబంధించి గత సంవత్సరం ఆరు వసతి గృహాల్లో నూరు శాతం ఫలితాలు నమోదు కాగా ఈ సంవత్సరం సగానికి సగం అంటే మూడు పాఠశాలలకు పడిపోయాయి. గత సంవత్సరం రెండు కేజీబీవీ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు రాబట్టగా ఈ సంవత్సరం ఒక్క పాఠశాలలో కూడా నూరు శాతం ఫలితాలు సాధించకపోవడం విశేషం. జిల్లా పరిషత్‌కు సంబంధించి పెరుగుదల కనిపించింది. గత సంవత్సరం 139 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు నమోదు చేయగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 145కు చేరుకోవడం విశేషం. అలాగే మున్సిపల్ హైస్కూల్స్‌లో గత సంవత్సరం నాలుగు పాఠశాలల్లో ఫలితాలు రాగా ఈ సంవత్సరం ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. ఏపీ రెసిడెన్షియల్స్‌కు సంబంధించి గత సంవత్సరం మూడు పాఠశాలలు కాగా ఈ సంవత్సరం నాలుగు అయ్యాయి. బీసీ వెల్ఫేర్, ఏపీ మోడల్ స్కూల్స్‌కు సంబంధించి గత సంవత్సరం మాదిరిగానే ఒక పాఠశాలతో సరి పెట్టుకోవల్సి వచ్చింది.