కృష్ణ

రేపటి నుండి అభ్యంతరాల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నూతనంగా అవిర్భవించనున్న మచిలీపట్నం కార్పొరేషన్‌కు సంబంధించి డివిజన్‌ల ఏర్పాటు పూర్తయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న 42 మున్సిపల్ వార్డులను 50 డివిజన్‌లుగా ఏర్పాటు చేస్తూ శనివారం ముసాయిదా విడుదల చేశారు. ఈ ముసాయిదాపై ప్రజల నుండి అభ్యంతరాలతో పాటు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తీసుకోనున్నారు. ప్రజల నుండి వచ్చే అభ్యంతరాల మేరకు ఈ నెల 30వతేదీ లోపు డివిజన్ల విభజనపై కొద్దిపాటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత నివేదికను జూన్ 3వతేదీ లోపు ప్రభుత్వానికి అందచేయనున్నారు. 7, 8 తేదీల్లో డివిజన్లను ఖరారు చేస్తూ తుది ముసాయిదాను ప్రభుత్వం ప్రకటించనుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షా 69వేల మంది పుర ప్రజలు ఉన్నట్లు తెలిపారు. డివిజన్‌కు 2వేల నుండి 2వేల 500 మందితో 50 డివిజన్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

ఘనంగా గోమాతకు కల్యాణం

మైలవరం, మే 18: స్థానిక ద్వారకామాయి నగర్‌లో వేంచేసియున్న శ్రీ షిరిడీ సాయి బాబా మందిరం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ ద్వారకామాయి గోపాద క్షేత్రం గోశాల నందు శనివారం గోమాతకు, వృషభానికి కల్యాణం అతి వైభవంగా, ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు స్థానిక నూజివీడురోడ్‌లోని వినాయకుని గుడి వద్ద నుండి బాబా మందిరం వరకూ మేళ తాళాలతో గోవును, వృషభాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. హైందవ సాంప్రదాయం ప్రకారం వివాహ ప్రక్రియనంతా నిర్వహించారు. గోమాత, వృషభరాజుల కల్యాణాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మందిరం వద్ద లలితాపారాయణ, రాత్రి పుణ్యహవాచనం, మండపారాధన నిర్వహించారు. శనివారం ఉదయం మహా హోమం నిర్వహించారు. కల్యాణం అనంతరం అక్కడికి హాజరైన సుమారు 600 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీ షిరిడీ సాయి సేవాదళ్ కోఆర్డినేటర్ వి బాలాజీ ప్రసాద్ వెల్లడించారు. నండూరి మారుతీనాధ్ శర్మ, రాధిక కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈకార్యక్రమంలో శ్రీ షిరిడీ సాయి బాబా మందిర సభ్యులు, గోభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవిధంగా గోమాతకు, వృషభరాజుకు కల్యాణం నిర్వహించటం వల్ల లోక కల్యాణం జరిగి, పాడి పంటలు సమృద్ధిగా పెరుగుతాయని, పశుగాభివృద్ధి జరుగుతుందని, సకాలంలో వర్షాలు పడతాయని, ఈకార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, తరించిన వారికి వంశాభివృద్ధి జరుగుతుందని పండితులు పేర్కొన్నారు.