కృష్ణ

లగడపాటి జోస్యంతో జోరందుకున్న పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలపై చెప్పిన జోస్యంతో మైలవరం ప్రాంతంలో పందాలు మరింత జోరందుకున్నాయి. లగడపాటి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజకీయ నేతలు, కార్యకర్తలు శనివారం సాయంత్రం టీవీల ముందు ప్రత్యక్షమయ్యారు. లగడపాటి ప్రెస్‌మీట్‌లో తాను ఎన్నికల ఫలితాలు ఇప్పుడే చెప్పగూడదని, ఈ నెల 19న సాయంత్రం తిరుపతిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేదీ స్పష్టంగా చెబుతానని చెబుతూ తెలంగాణలో మిగులు బడ్జెట్ కారణంగా అక్కడి ప్రజలు కారెక్కారని, ఆంధ్రలో లోటు బడ్జెట్ కారణంగా ఇక్కడి ప్రజలు సైకిలెక్కారని పరోక్షంగా టీడీపీ గెలుస్తుందన్న సంకేతాలను ఇవ్వటంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పైగా గత 15 ఏళ్ళలో ఒక్క తెలంగాణ ఎన్నికల ఫలితాలు తప్ప ఇప్పటి వరకూ తాను చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయని రేపు తాను రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది ఖచ్చితంగా చెబుతానని ప్రకటించారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మళ్ళీ తామే అధికారంలోకి వస్తున్నామని పేర్కొంటూ పందాల కయ్యాలకి కాలు దువ్వుతున్నారు. మరో వైపు వైసీపీ శ్రేణులు కొంత డీలా పడుతున్నారు. ఐనప్పటికీ లగడపాటి జోస్యం తెలంగాణలో ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుందని, వచ్చేది తమ ప్రభుత్వమేనని వైసిపి శ్రేక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం పందాలలో ఒకటికి రెండు రెట్లు అధికంగా ఇస్తామని గెలిచేది తమ పార్టీయేనని కవ్విస్తున్నారు. లగడపాటి సర్వేపై సర్వత్రా ఆసక్తినెలకొంది. అందరూ దీనిపై చర్చించుకోవటం కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన కోసం ఎక్కువ మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వివిధ సంస్థలు చెప్పే సర్వే ఫలితాలు, లగడపాటి చెప్పే ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాతే పందాలపై ముందుకు రావాలని పందాల రాయిళ్ళు కొందరు మరో రోజు కోసం ఎదురు చూస్తున్నారు. లగడపాటి పరోక్షంగా చెప్పిన సర్వే ఫలితాలను పైకి కొట్టి పారేస్తున్న వైసీపీ నేతలు లోలోన మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలకు రోజులు దగ్గర పడుతుండటంతో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.