కృష్ణ

కౌంటింగ్ పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి నియోజకవర్గాల వారీగా ఐఎఎస్ అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్‌తో పాటు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక భాగంగా ఉన్న ఏలూరు పార్లమెంట్‌కు, వాటి పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లకు ఐఎఎస్ అధికారుల నియామకాన్ని చేపట్టారు. వీరు ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు సంబంధించి గణేష్ కుమార్, విజయవాడ పార్లమెంట్‌కు పి జవహర్, ఏలూరు పార్లమెంట్‌కు దేవదత్ శర్మ నియమితులవ్వగా తిరువూరు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి గోవింద్ మారుతీ బోడ్కే, నూజివీడుకు ఎస్ ప్రతిబన్, గన్నవరంకు రాజేష్ కుమార్ పాండే, గుడివాడకు ప్రేమ్‌ప్రకాశ్ పాయ్, కైకలూరుకు అభిషేక్ త్రిపాఠి, పెడనకు కె అజీష్, మచిలీపట్నంకు జీఎల్ ప్రవీణ్ కుమార్, అవనిగడ్డకు బినోదానంద్ జా, పామర్రుకు రాజ్ కుమార్, పెనమలూరుకు ఎం తంగవేల్, విజయవాడ (పశ్చిమ)కు వినయ్ కుమార్ పాండే, విజయవాడ (మధ్య)కు ఎన్ కాళిదాస్, విజయవాడ (తూర్పు)కు మహేంద్ర ప్రసాద్, మైలవరానికి భన్వర్ సింగ్ సందూ, నందిగామకు అశోక్ కుమార్ భుయన్, జగ్గయ్యపేటకు జి మహాత్మలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.