కృష్ణ

కాటేస్తున్న కార్బైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): పండ్ల జాతిలో రారాజు మామిడి పంటను కార్లైడ్ కాటేస్తోంది. మామిడి పండ్లు చూడటానికి పసుపు రంగులో నిగ నిగలాడుతున్నా తినే సరికి పుల్లగా, లోపల తెల్లగా ఉండటంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం పక్వానికి రాని మామిడి కాయలను కార్బైడ్‌తో మగ్గించడమే. దీని వల్ల మామిడిలో రుచి పోతుందని, అంతే కాకుండా ఆ పండ్లను తింటే ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతారని వ్యవసాయ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మామిడి పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినవి అమ్మితే ఫర్వాలేదు. ఇప్పుడంతా కృత్రిమంగా మాగబెట్టిన కాయలను విక్రయిస్తున్నారు. మామిడి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన జిల్లాలో కృత్రిమ పద్ధతిలో మామిడి కాయలను మాగపెట్టే విధానం పాతికేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది దిగుబడులు తక్కువగా ఉండటంతో పండ్లకు గిరాకీ పెరిగింది. జిల్లాలో 1.60లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 4లక్షల టన్నులకు పైగా దిగుబడులు లభిస్తుందని అంచనా. ఏది ఏమైనా ప్రతి యేటా ఈ కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లను తినాల్సిందేనా అని ప్రజలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.