కృష్ణ

పంచాయతీ ఓటర్ల జాబితా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ఓటర్ల జాబితాను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23లక్షల 41వేల 337 మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారని తెలిపారు. వీరిలో 11,56,141 మంది పురుషులు, 11,85,060 మంది మహిళా ఓటర్లు, 136 మంది ఇతరులు ఉన్నారన్నారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. జిల్లాలోని 979 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇందుకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేశామని, ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేయనున్నదన్నారు. కృత్తివెన్ను మండలం చినపండ్రాక గ్రామ పంచాయతీ మినహా జిల్లాలోని 979 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది జూలై 31 వరకు చినపండ్రాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీకాలం ఉన్నందున ఈ పంచాయతీ ఎన్నిక మినహా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 49 మండలాలు, 979 గ్రామ పంచాయతీలు, 9998 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే మచిలీపట్నం డివిజన్‌లోని 12 మండలాల్లో 234 గ్రామ పంచాయతీల్లో 3,64,073 మంది ఓటర్లు, గుడివాడ డివిజన్‌లో 9 మండలాల్లో 219 గ్రామ పంచాయతీల్లో 4,44,819 మంది, విజయవాడ డివినజ్‌లోని 14 మండలాల్లో 240 గ్రామ పంచాయతీల్లో 8,72,443 మంది ఓటర్లు, నూజివీడు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 287 గ్రామ పంచాయతీల్లో 6,60,002 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఓటర్ల జాబితా విడుదల కార్యక్రమంలో డీపీవో జీ రవీందర్, డివిజనల్ పంచాయతీ అధికారి చంద్రశేఖర్, ఎస్‌ఆర్‌ఆర్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వెలగా జోషి తదితరులు పాల్గొన్నారు.