కృష్ణ

కృష్ణానది, కాల్వల ప్రక్షాళన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జిల్లాలో కృష్ణానది, కాల్వల ప్రక్షాళనపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌ను ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని చెన్నై బయలుదేరి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయనాకి వచ్చిన కలెక్టర్‌ను ఆయన అభినందించారు. కృష్ణానదీ తీరప్రాంతంతో పాటు జిల్లాలోని ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు కలెక్టర్ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 25వేల మందిని ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేలా కార్యోన్ముఖులను చేయాలన్న సంకల్పం ఎంతో గొప్పదన్నారు. తాను గుంటూరు పర్యటనకు వెళ్ళేటప్పుడు బందరు కాల్వను పరిశీలించానని, కాలువ ప్రక్షాళనతో పరిశుభ్రంగా కనిపించిందన్నారు. నగర పోలీసు కమిషనర్, వారి సిబ్బంది కూడా ప్రక్షాళనలో భాగస్వాములయ్యారని, వీరందరి కృషి వల్ల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతం చేయగలిగామని ఉప రాష్ట్రపతికి వివరించారు.