కృష్ణ

అందరికీ వసతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణా విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు అన్ని వసతులను జిల్లా అధికార యంత్రాంగం చేపట్టింది. వసతుల కల్పనకై ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. వసతి, భోజన ఏర్పాట్లను మూడు విభాగాలుగా విభజించారు. ఫుడ్, రిసెప్షన్, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల నుండి ఉద్యోగులతో ఏర్పాటైన ఈ కమిటీల ప్రతినిథులకు వసతుల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వసతుల కల్పనలో ఏ చిన్న అసౌకర్యం లేకుండా చూడాలని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) చైర్మన్ పి విల్సన్ బాబు ఆదేశించారు. కౌంటింగ్‌కు ముందు రోజైన 22వతేదీ సాయంత్రం నుండే వసతి, భోజన సౌకర్యాలను విశ్వ విద్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్నారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు వారు వెళ్లే ప్రాంతాలను తెలిపే విదంగా ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిథులకు కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రౌండ్‌ల వారీ ఫలితాలు తెలియ చేయనున్నారు. నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్లకు సంబంధించి సిబ్బందికి రాంజీ హైస్కూల్ వద్ద ఉన్న బాలుర వసతి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల సంబంధించి కౌంటింగ్‌కు హాజరయ్యే మహిళా ఉద్యోగుల కోసం పట్టణంలోని లేడియాంప్తిల్ మహిళా జూనియర్ కళాశాల వద్ద ఉన్న రెండవ నెంబరు బాలికల వసతి గృహంలో వసతి కల్పించారు. పెనమలూరు, గన్నవరం, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సిబ్బందికి వలందపాలెంలోని రెండవ నెంబరు బాలుర వసతి గృహంలో, పెడన, గుడివాడ నియోజకవర్గాలకు సంబంధించి వలందపాలెం ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ఉన్న బీసీ కళాశాల వసతి గృహంలో, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు సంబంధించి రుద్రవరంలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్‌లో వసతి సౌకర్యం కల్పించారు.