కృష్ణ

మళ్లీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): తెలుగుదేశం పార్టీ విజయం కోరుతూ రాష్ట్ర మంత్రి, బందరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర బుధవారం పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరగ్రహారం దర్గా, స్థానిక గాంధీ బొమ్మ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీకి మరోసారి విజయాన్ని అందించనున్నాయన్నారు. నేడు జరిగే ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్ మోదుగుమూడి శేషుబాబు, బత్తుల రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.