కృష్ణ

మూడంచెల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా విశ్వ విద్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండగా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేందుకు పోలీసులు మూడంచల భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్వీయ పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రం లోపల, వెలుపల కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. సెక్టార్ వారీగా బందోబస్తు విధులు కేటాయించారు. విశ్వ విద్యాలయానికి 200 మీటర్ల దూరం మేర 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారినే అనుమతించనున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో లోనికి అనుమతించే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. అయితే ఇప్పటికే కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మీడియాకు ఎన్నికల సంఘం పాస్‌లు, ఐడీ కార్డులు జారీ చేసింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విశ్వ విద్యాలయం సమీపంలోని మూడు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల మళ్లింపుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులను పోలీసులు నిరాకరిస్తున్నారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు వంటివి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపుకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది.