కృష్ణ

పక్కాగా ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గత నెల 11వతేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపుకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. నేడు జరగనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బందరు మండలం రుధ్రవరం గ్రామంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు సంబంధించి మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, ఏలూరు పార్లమెంట్‌లోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజయవాడ కానూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో విజయవాడ పార్లమెంట్‌కు సంబంధించిన జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. తొలిగా పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. 500 ఓట్ల లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణలోకి తీసుకుని వచ్చిన ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత అంటే 8.30ని.లకు ఇవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు వేర్వేరుగా టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్యను రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చివరిగా వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పుల లెక్కింపు చేపడతారు. లాటరీ ద్వారా నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్స్‌ను ఎంపిక చేస్తారు. ఇవీఎంల లెక్కింపు పూర్తయిన నాటికే ఫలితం దాదాపు ఖరారవుతుంది. కానీ వీవీ ప్యాట్స్‌లోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికారికంగా ఫలితం వెలువడదు.