కృష్ణ

కిస్సా కుర్సీకా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. గడిచిన నెలన్నర రోజులుగా నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసిన ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టనుందో మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఇవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇప్పటి వరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన అభ్యర్థులు నేడు వెల్లడి కానున్న ప్రజా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో అనే ఉత్కంఠతకు కూడా తెర పడనుంది. నేడు వెలువడనున్న ఫలితాలు కారణంగా కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో బెట్టింగ్‌లు జరిగాయి. పార్టీలతో ఏ మాత్రం సంబంధం లేకుండగా అభ్యర్థుల బలోపబలాలను ఆధారంగా బెట్టింగ్‌లు జరిగాయి. స్వపక్షానికి చెందిన వారే ప్రతిపక్ష అభ్యర్థులపై కోట్లలో బెట్టింగ్‌లు వేశారు. బెట్టింగ్‌లు ఖరారు చేసుకున్న వారంతా నేడు ఫలితాలు వెల్లడయిన మరుక్షణం బెట్టింగ్ సొమ్ము పోజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుండి పందెపు రాయుళ్లతో పాటు అభ్యర్థుల అనుచరగణమంతా కౌంటింగ్ కేంద్రాలైన మచిలీపట్నం, విజయవాడ వేదికగా బస చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లోని హోటళ్లు, లాడ్జిలతో పాటు కల్యాణ మండపాలను సైతం వీరు వసతి చేస్తున్నారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణాజిల్లా నేడు నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని జిల్లాగా కొనసాగుతోంది. అటువంటి ఈ జిల్లాపై పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సీపీ, జనసేన తహతహలాడుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిన జిల్లాలో పాగా వేసేందుకు వైఎస్‌ఆర్ సీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆరు నూరైనా నూరు ఆరైనా జిల్లాలో పాగా వేయాల్సిందే అన్న పట్టుదలతో వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల్లో శ్రమించింది. ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండటంతో మెజార్టీ స్థానాలపై వైఎస్‌ఆర్ సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం గతంలో ఉన్న సీట్ల కంటే అధిక సీట్లను ఈ విడత కైవసం చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఈ విడత రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 10 నుండి 14 అసెంబ్లీ స్థానాలు మావేనంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే సీపీఎం, సీపీఐ, బీఎస్పీతో కూటమిగా ఏర్పడిన జనసేన జిల్లాలో ఏ మేర ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాలో ఆ సామాజిక వర్గ ఓట్లతో జనసేన ఏ మేర సీట్లు సంపాదిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే పొత్తుల కారణంగా జిల్లాలో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపించడం లేదు. పొత్తుల నేపథ్యంలో జనసేన కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. గుడివాడ నియోజకవర్గం నుండి నామినేషన్ జనసేన అభ్యర్థి నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. మిగిలిన ఆరు స్థానాలకు గాను నాలుగు స్థానాల్లో బీఎస్పీ, ఒక స్థానంలో సీపీఎం, ఒక స్థానంలో సీపీఐ పోటీ చేసింది. వీరిలో విజయవాడ సెంట్రల్ నుండి సీపీఎం తరఫున పోటీ చేసిన చిగురుపాటి బాబూరావు ఒక్కరే బలమైన అభ్యర్థి కావడం విశేషం. అలాగే తొమ్మిది స్థానాల్లో నిలిచిన అభ్యర్థులంతా కొత్తగా పోటీ చేస్తున్న వారే. మరి వీరిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది నేడు వెలువడే ఫలితాలు తెలియచేస్తాయి.