కృష్ణ

ఫ్యాన్.. తుఫాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నవ్యాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గత నెల 11న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఓట్ల సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పరాజయం పొందగా ఎంపీలుగా బరిలో నిలిచిన మంత్రులు శిద్దా రాఘవరావు (ఒంగోలు), ఆదినారాయణరెడ్డి (కడప) ఓటమిని చవి చూశారు. రాష్ట్రంలో టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసింది. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన అన్ని స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది స్థానాలు, నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. కడప(10), కర్నూలు(14) జిల్లాల్లో సైతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయ దుందుభి మోగించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లకు గాను 31, కోస్తాంధ్రలో 89 నియోజకవర్గాల్లో 73 స్థానాల్లోనూ, రాయలసీమ 52 అసెంబ్లీ స్థానాలకు గాను 48 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వీవీ ప్యాట్లను కూడా లెక్కించాల్సి రావటంతో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. కాగా గుంటూరు, శ్రీకాకుళం, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీలో ఉండగా మిగిలిన 22 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. టీడీపీ మెజారిటీ ఉన్న స్థానాల్లో కూడా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలు సాధించిన ప్రతిపక్షాల జాబితాలో వైసీపీ తృతీయ స్థానంలో ఉండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు ఎలక్షన్ మిషన్-2019లో టీడీపీ 20 ప్లస్ లోక్‌సభ స్థానాలు, 150 ప్లస్ శాసనసభ స్థానాల్లో విజయం సాధించాలంటూ చేసిన నినాదం తారమారై అదే తరహాలో వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. 2004లో వైఎస్ హయాంలో కంటే అతి తక్కువ స్థానాలు గెలుచుకోవటాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ వైసీపీకి అనుకూలించిందనే విశే్లషణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఉద్దండులకు సైతం ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. సీనియర్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, జవహర్, పితాని సత్యనారాయణ, సుజయ్‌కృష్ణ రంగారావు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, నక్కా ఆనంద్‌బాబు, ఈనెల 10వ తేదీ వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించి నిబంధనల ప్రకారం రాజీనామాచేసిన అరకు శాసనసభ టీడీపీ అభ్యర్థి కిడారి శ్రావణ్‌కుమార్, అమర్‌నాధ్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి అచ్చెన్నాయుడు మాత్రమే విజయం సాధించారు. విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్న గంటా శ్రీనివాసరావు స్వల్ప మెజారిటీలో ఆధిక్యతతో ఉన్నారు. కాగా కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత జగన్, చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు అమరావతి నుంచి విశే్లషణ జరిపారు. వైసీపీ ఊహించని రీతిలో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. గురువారం ఉదయానికే కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున జగన్ నివాసానికి చేరుకున్నారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన దగ్గర నుంచే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈనెల 25వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించిన అనంతరం 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. అసలు ఎక్కడ తప్పు జరిగిందనే విషయమై ప్రజావేదికలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు కొద్దిసేపు చర్చించిన అనంతరం చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు. కాగా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తమ పార్టీ పరాజయాన్ని అంగీకరిస్తూనే భవిష్యత్ కార్యాచరణకు సన్నద్ధమవుతామని స్పష్టం చేశారు.