కృష్ణ

తిరుపతి-కాకినాడకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్): వేసవి రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి తిరుపతికి 4ప్రత్యేకరైళ్లు నడుపుతున్నామని దక్షిణ మద్య రైల్వే సీపీఆర్‌ఓ సీహెచ్ రాకేష్ తెలిపారు. తిరుపతి కాకినాడ ట్రైన్ నెం (07432) ప్రత్యేక రైలు 24, 26న తిరుపతిలో సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి (07431)25, 27న కాకినాడ నుంచి రాత్రి 9.45లకు బయలుదేరి తిరుపతికి మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు చేరుతుంది. ఈరైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట స్టేషన్‌లో ఆగుతుంది.
మంగూళురుకు ప్రత్యేక రైలు
రైల్వే ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించేందుకు గోండియా జంక్షన్, మంగూళురుకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మద్యరైల్వే సీపీఆర్‌ఓ సీహెచ్ రాకేష్ తెలిపారు. విజయవాడ మీదుగా నడిచే గోండియా- మంగుళూరు ప్రత్యేకరైలు (08601)24న గోండియాలో రాత్రి 11 గంటలకు బయలుదేరి రెండోరోజు రాత్రి 9గంటలకు మంగళూరు చేరుతుంది. ఈరైలు బళ్లార్షా, వరంగల్, విజయవాడ, దూడురు, రేణిగుంట, జోలార్‌పేట్, సేలమ్, కోయంబత్తురు, పాలక్కడ్, కానూర్ స్టేషన్‌లో ఆగుతుందని తెలిపారు.

జగన్‌కు శుభాకాంక్షలు
లబ్బీపేట, మే 23: సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంపై చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సీసీఐ) ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీఎఫ్‌సీసీఐ) అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహచలం, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు హబీబుర్ రహమాన్ అభినందనలు తెలిపారు.