కృష్ణ

మూడు దశాబ్దాల తర్వాత నందిగామలో టీడీపీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: నందిగామ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు చెందిన మొండితోక జగన్మోహనరావు 10,527 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 65,776 ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు తంగిరాల సౌమ్యకు 53, 249 ఓట్లు లభించాయ. తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై 15రౌండ్లు పూర్తయ్యే సరికి 6,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 33 రౌండ్లు ఉండగా సాయంత్రం 6.30 గంటల వరకు 15 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మొదటి నుండి అన్ని రౌండ్లలోను వైకాపా అభ్యర్ధి ఆధిపత్యం ప్రదర్శించారు. పోస్టల్ ఓట్లు కాకుండా మొండితోక జగన్మోహనరావుకు ఈ అధిక్యత లభించింది. వృత్తి రీత్యా వైద్యుడైన జగన్మోహనరావు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఒక పక్క వైద్యుడిగా సేవలను అందిస్తు మరో పక్క నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు పాటుపడ్డారు. 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్ధి తంగిరాల ప్రభాకరరావుపై ఓటమి చెందినప్పటికి ఈ ఐదేళ్ళ కాలంలో నియోజకవర్గంలో ప్రజల సమస్యల తరుపున పోరాటం చేసి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయనపై నమ్మకంతో ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ అసెంబ్లీ సీటును కేటాయించడంతో పాటు స్వయంగా నందిగామ వచ్చి ప్రచార సభలో పాల్గొన్నారు. ఐదేళ్ళలో నియోజకవర్గంలో వైకాపా నవరత్నాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళగలిగిన జగన్మోహనరావు ఈ ఎన్నికల్లో పట్టు సాధించి ప్రజల విశ్వాసాన్ని చూరగొని విజయం సాధించారు.
టీడీపీ కోటను బద్దలు కొట్టిన వైసీపీ
నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది. పార్టీ ఆవిర్భావం సమయంలో తెలుగుదేశం అభ్యర్ధిగా వసంత నాగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొంది, ఎన్టీరామారావు ప్రభుత్వంలో హోమ్ శాఖమంత్రిగా పనిచేశారు. తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరగా దేవినేని వెంకటరమణ 1995లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన రైలు ప్రమాదంలో ఆకస్మీక మరణించడంతో 1999లో దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ రంగ ప్రవేశం చేసి 1999, 2004లోను రెండు పర్యాయాలు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఈ అసెంబ్లీ స్ధానం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో దేవినేని ఉమా మైలవరం వెళ్ళగా 2009, 2014లో టీడీపీ అభ్యర్ధిగా తంగిరాల ప్రభాకరరావు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఆకస్మీక మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టలేదు. ఐతే కాంగ్రెస్ అభ్యర్ధిగా వేల్పుల పరమేశ్వరరావు ఉప ఎన్నికల బరిలో నిలువగా ఆయనపై తంగిరాల సౌమ్య టీడీపీ అభ్యర్దినిగా పోటీ చేసి గెలుపొందారు. 35సంవత్సరాల అనంతరం మొట్టమొదటి సారిగా మొండితోక జగన్మోహనరావు విజయంతో తెలుగుదేశం కోటలో వైకాపా పాగా వేసింది.

నూజివీడులో వైసీపీ ఘన విజయం
నూజివీడు, మే 23: నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యునిగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌అప్పారావు ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం గురువారం మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో ఎమ్మెల్యే ప్రతాప్‌అప్పారావు పోటీ పడ్డారు. లెక్కింపుప్రారంభం నుండి ప్రతాప్ ఆధిక్యత చాటుకున్నారు. 24 రౌండ్లుగా జరిగిన లెక్కింపులో 22 రౌండ్లలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యత చాటగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీడీపీ అభ్యర్ధి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అధిక్యత సాధించారు. చివరకు 16,277 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్ధి ప్రతాప్‌అప్పారావు విజయం సాధించారు. 2014 జరిగిన ఎన్నికల్లో ప్రతాప్‌అప్పారావు10,480 మెజార్టీ సాధించగా ఈఎన్నికలలో 16,277 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. నూజివీడు నియోజకవర్గంలో 1,99,413 ఓట్లు పోలైనవి. వాటిలో వైసీపీకి 1,01,333, టీడీపీకి 85,301,జనసేన పార్టీకి 4976 ఓట్లు పోలైయ్యాయి. వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 245 రాగా వైసీపీకి మెజార్టీ 16,277 ఓట్ల మెజార్టీ వచ్చింది. లెక్కింపు కేంద్రంలో వైకాపా అభ్యర్ధి, ఎమ్మెల్యే ప్రతాప్‌అప్పారావు తన ఏజెంట్లతో కలిసి లెక్కింపు తీరును పరిశీలించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్ధి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఓటమి చెందినప్పటికి లెక్కింపు చివరి వరకు లెక్కింపు కేంద్రంలోనే ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగింది.
ఇది ప్రజా విజయం...
ఇది ప్రజా విజయమని, ప్రజలందరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని మనస్పూర్తిగా కోరుకుని ఓట్లు వేశారని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుతెలిపారు. ఫలితాల అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి రాజన్న రాజ్యం అందిస్తారన్న నమ్మకంతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారని అన్నారు. జగనన్న రాజ్యంలో నవరత్నాలను అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని, నూజివీడును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు.
పేటలో ఫ్యాన్ పాగా
జగ్గయ్యపేట, మే 23: జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ అభ్యర్ది సామినేని ఉదయభాను విజయం సాధించారు. 18 రౌండ్లు పూర్తయ్యే సరికి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్ధి సామినేని ఉదయభానుకు 5,356 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ రౌండ్ వరకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ అభ్యర్ది సామినేని ఉదయభానుకు 85,463 ఓట్లు రాగా దేశం అభ్యర్ధి శ్రీరామ్ రాజగోపాల్‌కు 80,107 ఓట్లు లభించాయి. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి , రెండవ రౌండ్‌లలో వైసీపీకి 426, 376 ఓట్ల మెజార్టీ లభించింది. 3వ రౌండ్‌లో దేశం అభ్యర్ధి శ్రీరామ్ రాజగోపాల్‌కు 346 ఓట్ల మెజార్టీ లభించింది. దేశం అభ్యర్ధి శ్రీరామ్ రాజగోపాల్‌కు 10వ రౌండ్‌లో 457, 15వ రౌండ్‌లో 362, 16వ రౌండ్‌లో 39 ఓట్ల మెజార్టీ మాత్రమే దేశం అభ్యర్ధికి రాగా మిగిలిన 14 రౌండ్‌లలోను వైసీపీ అభ్యర్ధి సామినేని ఉదయభాను పై చెయ్యి సాధించారు. కాగా ఈ ఎన్నికలలో 18వ రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్ధి కర్నాటి అప్పారావుకు మొత్తం 1217 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి ప్రపుల్లా శ్రీకాంత్‌కు 560 ఓట్లు, జనసేన అభ్యర్ధి ధరణికోట వెంకటరమణకు 1300 ఓట్లు పోలైయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్ధులు దశరధ రామారావుకు 234 ఓట్లు, జాన ఆనందరావుకు 89 ఓట్లు, ఫణిచైతన్యకు 66 ఓట్లు, శ్రీరామ్ రామకృష్ణకు 209 ఓట్లు, ఉదయమాధవ్‌కు 154 ఓట్లు రాగా నోటాకు 998 ఓట్లు లభించడం విశేషం.
దేశం పార్టీని ఆదుకోని పట్టణం
ప్రతి ఎన్నికలలోను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచే జగ్గయ్యపేట పట్టణం ఈసారి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రెండు రౌండ్లలో వైసీపీకి మెజార్టీ వచ్చిన పట్టణ బూత్‌లు ప్రారంభమయ్యే 3వ రౌండ్ నుంచి తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుందని, ఆ మెజార్టీనే దేశం పార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న టీడీపీ శ్రేణులకు పట్టణం నుంచి సహకారం లభించక పోవడంతో ఓటమి తప్పలేదు. 4వ రౌండ్‌లో పట్టణ బూత్‌లు గల 4వ రౌండ్ నుండి 9వ రౌండ్ వరకు వైసీపీకి మెజార్టీ సాధించింది. మరలా 10వ రౌండ్‌లో టీడీపీకి 457 ఓట్లు మెజార్టీ లభించిన అప్పటికే వైసీపీ మెజార్టీ 3,300 ఓట్లు మెజార్టీ ఉండటంతో ఆ విజయపరంపరను జగ్గయ్యపేట మండలం, వత్సవాయి, పెనుగ్రంచిప్రొలులో కొనసాగించింది. పెనుగ్రంచిప్రోలు మండలంలో 15, 16 రౌండ్‌లలో దేశం పార్టీకి 362, 39 ఓట్లు మెజార్టీ లభించిన వైసీపీ గెలుపు పరంపరను అడ్డుకోలేకపోయింది.