కృష్ణ

జగన్‌ను కలిసిన కలెక్టర్ ఇంతియాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ కలిశారు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన ఐఎఎస్ అధికారుల సమావేశానికి కలెక్టర్ ఇంతియాజ్ కూడా హాజరయ్యారు. మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జగన్‌కు వివరించారు. జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా జగన్ కలెక్టర్‌ను కోరారు.

విజేతలకు వెల్లువెత్తిన అభినందనలు

మచిలీపట్నం(కోనేరుసెంటర్), మే 24: సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు అభినందనలు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో హోరాహోరీ పోటీలో విజయాన్ని అందిపుచ్చుకున్న తమ అభిమాన నేతలను అభినందించేందుకు కార్యకర్తలతో పాటు అధికారులు కూడా క్యూ కట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరి ఇల్లు, కార్యాలయం శుక్రవారం సందడి సందడిగా మారింది. తమ తమ నియోజకవర్గాల నుండే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు కూడా తమ అభిమానాన్ని సన్మానం రూపంలో చూపుకున్నారు. విజేతలను కలిసి పుష్పగుచ్చాలతో పాటు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ప్రోటోకాల్‌లో భాగంగా అధికారంలోకి వచ్చిన వారి ఇంటికి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా వారికి అభినందనలు తెలియచేశారు. పోలీసు శాఖ నుండి కూడా విజేతలకు అభినందనలు వెల్లువెత్తాయి. బందరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వల్లభేని బాలశౌరి, ఎమ్మెల్యేగా ఎన్నికైన పేర్ని వెంకట్రామయ్య (నాని)ల కార్యాలయాలు కార్యకర్తలతో కిటకిటలాడాయి. సత్కారాల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.