కృష్ణ

సాంకేతిక విద్యతో బంగారు భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు:సాంకేతిక విద్యారంగానికి బంగారు భవిష్యత్ ఉందని, సాంకేతిక విద్యలో మెలకువలు తెలుసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హరశ్రీరాములు చెప్పారు. స్థానిక ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించే విద్యార్థినీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులను శనివారం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హరశ్రీరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆదేశానుసారం ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30 వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. సాంకేతిక విద్యపై అవగాహన కల్పించటంతో పాటు సాంకేతిక విద్యలో మెలకువలు నేర్పించటం దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులకు అంతర్జాతీ స్థాయిలో విద్యాబోధన జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రతినిధులు లలితకుమారి, బి విశ్వనాథం, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పేర్నిని కలిసిన ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: ఏలూరు రేంజ్ డీఐజీ అబ్దుల్ సత్తార్ ఖాన్ శనివారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని మర్యాద పూర్వకంగా కలిశారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని డీఐజీకి సూచించారు. ప్రతి ఒక్కరికీ పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.