కృష్ణ

కోతకు గురవుతున్న కృష్ణా కరకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: కృష్ణానది హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుండగా ఉల్లిపాలెం గ్రామం దాటిన తరువాత నదీ ప్రవాహం మలుపు తిరగటంతో నీటి ఉద్ధృతి కారణంగా కరకట్ట భారీగా కోతకు గురయింది. సమస్యను గుర్తించిన గత ప్రభుత్వం రూ.60లక్షలతో నీటి ఉద్ధృతి ఆపడానికి మలుపు ప్రాంతంలో సరుగు బాదులు పాతి తడికెలను అడ్డం పెట్టారు. ఏడాది తిరగకముందే ఆ బాదులు పుచ్చిపోయి పాటు సమయంలో తడికెలు ఎండకు ఎండుతూ పోటు సమయంలో నీటిలో నానుతూ శిథిలమయ్యాయి. వర్షాకాలం ప్రారంభం కాకపోయినా నదీ ప్రవాహపు ఉద్ధృతి నిత్యం ఉంటూనే ఉండగా దీనికి తోడు వర్షాలు తోడైతే పై నుంచి కురిసే వర్షాల ధాటికి కరకట్ట కరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే రానున్న వర్షాకాలంలో కరకట్ట ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో స్పందించి శాశ్విత ప్రాతిపదికన కొండరాళ్లు తెప్పించి కరకట్ట మలుపు ఉన్న ప్రదేశం వరకు రివిట్‌మెంట్ పరిచి పటిష్టం చేయాలనే డిమాండ్ వస్తోంది.

25న ఫెర్రీ బల్లకట్టు నిర్వహణ కోసం వేలం పాట
మచిలీపట్నం(కోనేరుసెంటర్), జూన్ 15: ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుండి గుంటూరు జిల్లా రాయపూడి ఫెర్రీ వరకు కృష్ణానదిపై బల్లకట్టు నిర్వహణకు ఈ నెల 25వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఇఓ షేక్ సలాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్లకట్టు నిర్వహణకు 2019-20 సంవత్సర కాలానికి గాను రూ.10వేలు షెడ్యూలు ఖరీదును ఈ నెల 25వతేదీ ఉదయం 11గంటల లోపు డీడీ చెల్లించి టెండరు ఫారం పొందాల్సి ఉంటుందన్నారు. అదే రోజు ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపు సీల్డు టెండరు వేయాల్సి ఉంటుందన్నారు. 3గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటదారుడు ముందుగా వేలం షరతులకు లోబడి ధరావత్తు రూ.20లక్షలు డీడీనీ జెడ్పీ సీఈఓ పేరిట చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. అప్‌సెట్ విలువ రూ.59లక్షల 81వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర వివరాలు జెడ్పీ కార్యాలయంలో గానీ ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గానీ తెలుసుకోవచ్చన్నారు.

మొవ్వ కోర్టు భవనాన్ని పరిశీలించిన న్యాయమూర్తుల బృందం
కూచిపూడి, జూన్ 15: మండల కేంద్రం మొవ్వ గ్రామంలో నూతనంగా ప్రారంభం కానున్న జూనియర్ సివిల్ కోర్టు, అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాలను శనివారం సాయంత్రం జిల్లా ఇన్‌ఛార్జ్ జడ్జి ఎం రామకృష్ణ బృందం పరిశీలించింది. ఈ కోర్టు భవనాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వెంకటేశ్వరరెడ్డి, షరీఫ్, వై శ్రీనివాసరావు, రమ్య, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, తహశీల్దార్ ఎస్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.