కృష్ణ

పేదల కోసం ప్రభుత్వ భూములను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క పేద వారికీ నివేశన స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక గిలకలదిండిలో పర్యటించి పేదలకు నివేశన స్థలాలకు అవసరమైన ప్రభుత్వ భూములను పరిశీలించారు. గిలకలదిండి గ్రామానికి చెందిన అనుకుని ఉన్న భూమి ఎంత విస్తీర్ణంలో ఉందనే వివరాలతోపాటు క్లాసిఫికేషన్ తదితర అంశాలలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందరు పోర్టు కోసం కేటాయించిన భూమి, కోస్టు గార్డు అవసరాల కోసం కేటాయించిన భూమి, మిగతా భూముల్లో ప్రభుత్వ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఆయన వెంట బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, తహశీల్దార్ సునీల్ బాబు, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులు ఉన్నారు.