కృష్ణ

బదిలీలకు వేళాయే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 9: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమయం అసన్నమైంది. శుక్రవారం నుండి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో జిల్లాలో కూడా పెద్దఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ శాఖల్లో అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులను బదిలీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పదిరోజుల పాటు జరిగే బదిలీలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బదిలీలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది బదిలీలు నిర్వహించగా శుక్రవారం నుండి రెండో విడత బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల్లో పెద్దఎత్తున బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. బదిలీల ప్రక్రియ ప్రారంభం కావటంతో తమకు అనుకూలమైన వారిని రప్పించుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిల్లో జరిగే బదిలీల్లో తమకు అనువైన అధికారులను వెతికి పట్టుకుని ప్రజాప్రతినిధుల ద్వారా బదిలీలు చేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా పది రోజుల పాటు జిల్లాలో బదిలీల జాతర నెలకొననుంది.