కృష్ణ

కార్యకర్తలపై దాడులు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వారు దాడులు చేస్తే సహించేది లేదని రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకుండానే రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పాల్పడటం అమానుషమన్నారు. గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ సానుభూతిపరులను గ్రామం నుండి వెళ్ళ గొట్టారని, అదే విధంగా జగ్గయ్యపేట మండలంలోని మల్కాపురం గ్రామంలో కళ్యాణం భాస్కరరావు మరికొందరు టీడీపీ వారి ఇళ్ళపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రబాబునాయుడు. నారా లోకేష్‌ల సూచనల మేరకు తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ పలు మార్లు అధికారంలో ఉన్న ఎన్నడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని, గత తమ ఐదేళ్ళ పరిపాలనలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆపార్టీ మనుగడే కోల్పోయేదన్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అధికారం ఇవ్వాలని ప్రజలు ఓట్లు వేసి వైకాపా గెలిపించారని, వారు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేసి మంచి పరిపాలన చేయాలని హితవు పలికారు. పోలీసులు శాంతిబద్రతల విషయంలో అధికార పార్టీ నేతల అండదండలతో విపక్ష పార్టీపై అక్రమ కేసులు పెడితే సహించబోమన్నారు. మల్కాపురం గ్రామంలో తమ పార్టీ వారిపై దాడులు జరిగినా పోలీసుల సూచనల మేరకు తాము గ్రామానికి వెళ్ళకుండా సమన్వయం పాటించామని, దానిని అసమర్థతగా భావించవద్దన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు సానుభూతిపరులకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు, ఫ్లోర్‌లీడర్ యలమంచిలి రాఘవ, వెల్ది శ్రీనివాస్, కళ్యాణం భాస్కరరావు,మైనేని రాధ, కౌన్సిలర్లు కొండా, అనిల్, శౌరి తదితరులు పాల్గొన్నారు.