కృష్ణ

క‘న్నీటి’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: నందిగామ పట్టణం, మండలంలోని గ్రామాల్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రి ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, మోటార్ల మోరాయింపు తదితర కారణాల వల్ల తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ప్రతి వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొంటున్నా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నందిగామతో పాటు అనాసాగరం, హనుమంతుపాలెం గ్రామాల్లో మొత్తం 45 వేల మంది జనాభా ఉండగా కృష్ణానది నుండి కాట్రేనిపాడు పంపింగ్ స్కీమ్, కీసర, నందిగామ మునే్నటి స్కీమ్‌ల నుండి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతోంది. ఈ స్కీమ్‌లు సక్రమంగా పని చేస్తేనే పట్టణంలో రెండు మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం కృష్ణానదిలో నీరు లేకపోవడం, విద్యుత్ సమస్యల కారణంగా నందిగామకు కొన్ని రోజులుగా కాట్రేనిపాడు స్కీమ్ నుండి నీటి సరఫరా నిలిచిపోయింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల తాగునీటి సమస్య తీవ్రమయ్యింది. పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు వాటర్ క్యాన్‌లను తెచ్చుకొని రక్షిణ మంచినీటి పథకాల వద్ద నీరు పట్టుకుని వెళుతున్నారు. విద్యుత్ సమస్య అధిగమించేందుకు ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహనరావు ఈ స్కీమ్‌ను పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే విధంగా మండలంలోని ఏటి పట్టు గ్రామాల్లో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మునే్నటి పైలెట్ ప్రాజెక్టు నుండి 13 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుండగా పైపులైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో బావులు, బోర్ల వద్ద ప్రజలు బారులుతీరడం కనిపిస్తోంది.