కృష్ణ

వలంటీర్లు వచ్చేస్తున్నారోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్ని డోర్ డెలవరీ చేసేందుకు ప్రభుత్వం నియమించనున్న వలంటీర్లు త్వరలోనే రానున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నిరుద్యోగులకు చక్కడి శుభవార్తను తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో భారీగా వలంటీర్లను నియమించేందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేసి నిరుద్యోగ యువత నుండి నేటి నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈప్రక్రియ ద్వారా జిల్లాకు సుమారు 14వేల వలంటీర్ల కొలువులు కొత్తగా రానున్నాయి. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రతీ గ్రామం, వార్డుల్లో 50మందికి ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈనెల 24 నుండి దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు సిద్ధమైయ్యారు. ప్రభుత్వం నియమించే ఈ గ్రామ వలంటీర్లకు వయో పరిమితితో పాటు, విద్యార్హతను నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది
ఎప్పటి నుండే అందరూ ఎదురు చూస్తున్న వలంటీర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులతో పాటు యువత కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వలంటీర్ల పోస్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు యువత సందడిగా సిద్ధమైంది. ఈనెల 24నుండి ఆన్‌లైన్‌లో అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూల్ 5న చివరి తేదిగా నిర్ణయించారు. జూలై 10నుండి దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. జూలై 11నుండి 25వరకు అభ్యర్థులకు ఎంపీడీవో ఆధ్యర్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వూలను నిర్వహించనుంది. సెలక్షన్ కమిటీలో కీలక సభ్యులు తహసీల్దార్, ఈవోఆర్డీ, ఎప్పీడీవోలు వ్యవహరించనున్నారు. ఇంటర్వూలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 1నుండి నియామక పత్రాలను అందుకోనున్నారు. అలాగే ఎంపికైన వలంటీర్లకు ఆగస్టు 5నుండి ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. ఆగస్టు 10వరకు వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు చేర్చే క్రమం వారి విధి విధానాలపై శిక్షణ అందించనున్నారు. ఆగస్టు 15నుండి వలంటీర్లు వీధుల్లోకి రానున్నారు. ఈనియామకాల్లో మాత్రం 50 శాతం మహిళా వలంటీర్లను నియమించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో వలంటీర్ల కోసం 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ మీడియట్, పట్టణ ప్రాంతాల్లో మాత్రం డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు. 18 ఏళ్లు దాటిన నిరుద్యోగ యువత వలంటీర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి అదే పంచాయతీలో నివాసం ఉండాల్సిందే. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల రూ.5వేల గౌరవ వేతనం ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతూ సిద్ధపడుతున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం సిద్ధపడుతున్నారు. మరో ఉద్యోగం వచ్చే లోపుగా వలంటీర్‌గా ఎంపికైతే రూ.5వేల జీతం రావచ్చని భావిస్తున్న యువత ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు.
జిల్లాకు 14వేల మంది వలంటీర్లు
రాష్ట్ర ప్రభుత్వం నియమించే వలంటీర్లకు సంబంధించి జిల్లాకు 14వేల మంది మాత్రం అవసరం కానున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 49 మండలాకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో వలంటీర్లను నియమించనున్నారు. జిల్లాలోని 972 గ్రామ పంచాయతీలు, 1005 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రాంతాల్లో వలంటీర్లను ప్రభుత్వం నియమించనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల వార్డుల్లో వీరు విధులను నిర్వర్తించనున్నారు జిల్లాలో ఉన్న మొత్తం 45,17,398 మంది ప్రజలకు ఈ వలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలవరీ చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 7, 36, 193 కుటుంబాలతో వీరు నేరుగా మమేకం కానున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లగా నియమించిన వారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు పని చేయాల్సి ఉంటుంది. వారికి కేటాయించిన పరిధిలో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత వలంటీర్లపైనే ఉంది. అలాగే ఆయా పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ, వార్డు, సచివాలయాల్లో, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్రామాలు, వార్డులకు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్న సందర్భంలో వలంటీర్లే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.