కృష్ణ

భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచనలు, సలహాల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె మాధవీలత అన్నారు. ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న మాధవీలతను గత మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆమె జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో జేసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శక పాలన అందిస్తానన్నారు. భూ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తానన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాల ఫలాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఇసుక రీచ్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకునే నూతన పాలసీ ప్రకారం ముందుకు వెళతామన్నారు. రెండు మూడు రోజుల్లో కొత్త పాలసీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా రావడం చాలా గర్వకారణంగా ఉంది. జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, మచిలీపట్నం ఆర్డీవో జె ఉదయ భాస్కర్, కలెక్టరేట్ ఎఓ మాధురి, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, బందరు తహశీల్దార్ సునీల్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు జేసీగా బాధ్యతలు స్వీకరించిన మాధవీలతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.