కృష్ణ

కామాంధులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై, ఒంగోలులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ), ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక రేవతీ సెంటరులో మంగళవారం మానవహారం నిర్మించారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి వి జ్యోతి మాట్లాడుతూ చిన్న పిల్లలను సైతం కామాంధులు బ్రతకనివట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వావి వరసలు, చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై, ఒంగోలులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను తీవ్రంగా ఖండించారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయటం ద్వారానే వీటిని అరికట్టవచ్చన్నారు. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర విచారణ జరిపి కామాంధులకు శిక్షపడేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్, యుటీఫ్ నాయకుడు డి వెంకటేశ్వరరావు, ఐద్వా టౌన్ కార్యదర్శి పి లక్ష్మి పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ‘కోటమ్మారెడ్డి’ మృతి

పామర్రు, జూన్ 25: పామర్రుకు చెందిన విద్యావేత్త, మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్ జిల్లా జడ్జి తమ్మా కోటమ్మారెడ్డి (94) మంగళవారం ఉదయం స్థానికంగా ఉన్న వారి స్వగృహంలో మృతి చెందారు. 1952-55 మధ్యన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒంగోలు జిల్లా పత్తిపాడు నుండి శాసనసభ్యురాలుగా ఆమె పని చేశారు. 1958-1983 వరకు జిల్లా జడ్జిగా పని చేసి 1983లో ఒంగోలులో ఆమె పదవీ విరమణ చేశారు. మచిలీపట్నం హిందూ కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీకి శాశ్వత సభ్యురాలిగా, పామర్రు తమ్మా కోటమ్మారెడ్డి కళాశాల ఛైర్మన్‌గా, పామర్రు శ్రీ షిర్డి సాయి దేవాలయం ట్రస్టీగా ఆమె ఉన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు డా. తమ్మా ఆనంద్ ప్రభుత్వ వైద్యాధికారిగా పని చేస్తూ గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. రెండవ కుమారుడైన తమ్మా వినోదరెడ్డి పీఆర్ ఇంజనీరింగ్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధాని హైదరాబాద్‌కు మారటానికి చివరి ఓటు అప్పటి శాసనసభ్యురాలుగా ఉన్న తమ్మా కోటమ్మారెడ్డి ఓటు ఉపయోగ పడిందని రాజకీయ నేతలు విశే్లషించారు. తమ్మా కోటమ్మారెడ్డి మృతదేహాన్ని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, డీవై దాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావులతో పాటు అనేక మంది రాజకీయ పక్ష నేతలు దర్శించి నివాళులర్పించారు. ఆమె మృతికి పామర్రు పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులతో పాటు మచిలీపట్నం హిందూ కళాశాల కరస్పాండెంట్ డా. ఆర్ ధన్వంతరి సంతాపం తెలిపి నివాళి అర్పించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి

కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి

పామర్రు, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో తన స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరు వద్ద కృష్ణా జిల్లాకు తమ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతానని ప్రకటించారని, వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని బీజెపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధ్రీశ్వరి కోరారు. మంగళవారం పామర్రులో జరిగిన బీజెపీ కార్యక్రమ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఈ సభా వేదిక ద్వారానే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా పేదల సంక్షేమం కోసం జగన్మోహనరెడ్డి పరిపాలన సాగాలని తాము ఆశిస్తున్నామని, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా 2024 నాటికి రాష్ట్రంలో బీజెపీ అధికార స్థాయికి ఎదగ గలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. *