కృష్ణ

ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): ప్రభుత్వం అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. మంగళవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను సందర్శించిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలిగి వారికి అవసరమైన సేవలు అందించటంతో పాటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కకాటు, పాముకాటుకు సంబంధించి మందులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అవసరం మేర మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే ఆస్పత్రిలోని పలు విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆమె వెంట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.