కృష్ణ

పరిషత్ ఎన్నికలు ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాల విభజన పరిషత్ ఎన్నికలపై ప్రభావం చూపనుందా..? మరో పది రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న పరిషత్ ప్రస్తుత పాలకవర్గాల స్థానంలో కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తారా..? లేకుంటే పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పాలనను తీసుకు వస్తారా..? అనేది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. జులై 4వతేదీతో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. అక్టోబర్ నాటికి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పదవీ కాలం ముగించుకుంటున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఉండకపోవచ్చేనే అభిప్రాయం మొన్నటి వరకు వినిపించింది. అయితే తాజాగా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం పావులు కదుదుతోంది. ఇందులో భాగంగానే పంచాయతీల వారీగా ఓటర్ల నమోదు, కుల గణన పూర్తి చేసింది. ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. మరి కొన్ని రోజుల్లో పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ద్వారా ఏర్పాటైన మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం ముగింపు సమయంలో వచ్చింది. గ్రామ పంచాయతీల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితానే ఆధారంగా చేసుకుని పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాల విభజన వల్ల దాదాపు పరిషత్ ఎన్నికలు కొంత కాలంగా వాయిదా పడతాయని అందరూ భావించారు. విభజన అనంతరమే ఎన్నికలు ఉండే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తున్నాయి. జిల్లాల విభజన పూర్తి కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జిల్లాల విభజన వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సెగ్మెంట్లలో కూడా మార్పులు చేర్పులు భారీగా చోటు చేసుకోనున్నాయి. భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. కొన్ని గ్రామాలు పక్క మండలాల్లో విలీనం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. జిల్లాలో మొత్తం 49 జెడ్పీటీసీ స్థానాలు, 869 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఒక్కొక్క ఎంపీటీసీ సెగ్మెంట్‌లో 3వేల 500 మంది ఓటర్లు ఉండాలనే నిబంధన తీసుకు వచ్చారు. దీని బట్టి జిల్లాలో ఎంపీటీసీ సెగ్మెంట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాల ఏర్పాటు తర్వాతే పరిషత్ ఎన్నికలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. మరి పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనేది వేచి చూడాల్సి ఉంది.