కృష్ణ

ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం పట్టణంలోని బాలుర హైస్కూల్‌లోపూర్వ విద్యార్థి అయిన సామినేని ఉదయభానుకు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలు అన్ని హంగులతో విద్యార్థులకు సేవలు అందిస్తాయన్నారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులకు హిందీ అక్షరాభ్యాసాన్ని ఆయన చేశారు. విద్యార్ధులకు యూనీఫాంలు, పాఠ్య పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో డివైఇఓ ఎల్ చంద్రకళ, హెచ్‌ఎం చావా కృష్ణయ్య, ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ, నేతలు తన్నీరు నాగేశ్వరరావు, మదర్‌సాహేబ్, మానేపల్లి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బడులకు అమ్మఒడి పట్ల హర్షం
ప్రైవేట్ పాఠశాలలకు కూడా అమ్మఒడి పథకాన్ని అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు విప్ ఉదయభానును కలిసి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరిస్తూ తమ కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తన్నీరు నాగేశ్వరరావు, కొమరగిరి భరధ్వజ్, బొల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.