కృష్ణ

పులకించిన పుడమితల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నీటి కోసం అర్రులు చాచిన పుడమితల్లి పులకించింది. బుధవారం ఉదయం జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములు తడిసిముద్దయ్యాయి. దీంతో నెర్రలిచ్చిన వ్యవసాయ భూములు మెత్తబడ్డాయి. దీంతో రైతులు ఖరీఫ్ సాగు చేసేందుకు దూకుడు పెంచారు. వరుణదేవుడు కరుణించటంతో జిల్లాలోని అన్ని మండలాల్లో దుక్కులను ముమ్మరం చేశారు. సాంప్రదాయబద్ధంగా, యంత్రాల సహాయంతో దుక్కులను ప్రారంభించారు. బోర్ల కింద పోసిన నారుమడులు వర్షానికి కళకళలాడుతున్నాయి. కొంత మంది రైతులు వర్షంతో భూమి మెత్తబడటంతో మెట్ట మడులు పోసేందుకు సిద్ధమయ్యారు. అలాగే యంత్రాల సహాయంతో నేరుగా విత్తనాలు వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది రైతులు జీలుగ విత్తనాలు చల్లుతున్నారు. పనులు లేక ఖాళీగా ఉన్న కూలీలకు పనులు దొరకటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నీటి తడులు అందక ఎండిపోయే స్థితికి చేరుకున్న కూరగాయల తోటలు, చెరకు, అరటి తదితర పైర్లకు భారీ వర్షం జీవం పోసింది. అలాగే భానుడి భగభగలకు అతలాకుతలమైన జిల్లా ప్రజలు వర్షంతో సేదతీరారు. ఏది ఏమైనా బుధవారం ఉదయం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతులు ఖరీఫ్ సాగుకు దూకుడు పెంచారనడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా మంగళవారం ఉదయం నుండి బుధవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 9.9మీ.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుడివాడ మండలంలో 65.8మీ.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కంచికచర్ల మండలంలో 1.2మీ.మీ వర్షపాతం నమోదైంది. ఉత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, బాపులపాడు, మొవ్వ, ఘంటసాల, గూడూరు, నందివాడ, గుడ్లవల్లేరు, పెడన, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.