కృష్ణ

నిరుపేదల ఇళ్ల స్థలాల మంజూరుకు డోర్ టు డోర్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): పట్టణంలోని నిరుపేదల ఇళ్ల స్థలాలు మంజూరుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం మంత్రి నివాసం వద్ద బైపాస్ రోడ్డులోనివాసం ఉంటున్న మేడిశెట్టి పార్వతి తదితరులు మంత్రిని కలిసి తాము అద్దె ఇళ్లల్లో బాధలు పడుతున్నామని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె ఇళ్లల్లో నివశిస్తూ సొంత ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు త్వరలో డోర్ టు డోర్ సర్వే చేయిస్తామన్నారు. వచ్చే ఉగాది నుండి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరు చేయుటకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రభుత్వ భూమి లేని చోట రైతుల నుండి భూములు కొనుగోలు చేసి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటం ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొంత మంది అర్జీదారులు పెన్షన్‌లు మంజూరు చేయాలని కోరగా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2000 నుండి రూ.2,250కి పెన్షన్‌ను పెంచటం జరిగిందని, ఈ విధంగా దశల వారీగా 3వేల వరకు పెన్షన్‌లు పెంపు చేయటం జరుగుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో త్వరలో సమావేశం నిర్వహిస్తామని, వివిధ విభాగాల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఖాళీలు భర్తీ చేయుటకు కృషి చేస్తామని, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ వ్రాస్తామని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని మంత్రి నాని అన్నారు. మచిలీపట్నం శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రి పదవిని పొందిన పేర్ని వెంకట్రామయ్య(నాని)ని లక్ష్మీపురం, ఉయ్యూరు కెసీపీ చక్కెర కర్మాగారాలలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా పని చేస్తున్న జి వెంకటేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంద చేసి అభినందనలు తెలిపారు.