కడప

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ‘మీకోసం’ కార్యక్రమ స్థానంలో ‘స్పందన’ కార్యక్రమాన్ని సోమవారం ఆమె నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలపై పరిష్కార చర్యలు తీసుకోవల్సిందిగా ఆయా శాఖాధికారులను ఆదేశించారు. తొలి రోజు స్పందన కార్యక్రమానికి మంచి ఆదరం లభించిందని జేసీ తెలిపారు. చాలా మంది ప్రజలు భూ సమస్యలు, రేషన్ కార్డులు, పాస్ పుస్తకాలు తదితర అంశాలపై ఎక్కువగా అర్జీలు సమర్పించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని స్పందన వెబ్‌సైట్‌లో పొందుపర్చి వారం రోజుల్లో పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిర్ధేశించిన గడువు లోపు స్పందన అర్జీలను పరిష్కరించని పక్షంలో సంబంధిత శాఖాధికారులపై చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, ముడ డెప్యూటీ కలెక్టర్లు సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.