కృష్ణ

‘వలంటీర్ల’ కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టనున్న గ్రామ వలంటీర్ వ్యవస్థకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియటంతో ఇంటర్వ్యూల ప్రక్రియకు అధికారులు తెర లేపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం మండల ఎంపిక కమిటీ నేతృత్వంలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లాలో మొత్తం 14వేల వలంటీర్ పోస్టులకు గాను 61వేల 843 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1898 దరఖాస్తులను తిరస్కరించగా మరో 720 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. మొత్తం 59వేల 225 దరఖాస్తులను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. అత్యధికంగా విజయవాడ అర్బన్‌లో 5వేల 250 దరఖాస్తులు అందగా 4వేల 998 దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. అత్యల్పంగా పెడన అర్బన్‌లో 377 దరఖాస్తులకు గాను 373 దరఖాస్తులను ధృవపరిచారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి 26వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఆగస్టు 15వ తేదీ నుండి గ్రామ వలంటీర్ల సేవలు కొనసాగిస్తారు.