కృష్ణ

కృష్ణా వర్సిటీని ఉన్నత స్థితికి తీసుకువస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 11: కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఆచార్య వైకె సుందరకృష్ణ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ వీసీగా పని చేసిన ఆచార్య రామచంద్రరాజు రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న సుందరకృష్ణను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ఆయన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విశ్వ విద్యాలయాన్ని అన్ని విధాలా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి కృష్ణా విశ్వ విద్యాలయం నేడు ఒక మంచి స్థానంలోకి వచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో విశ్వ విద్యాలయంకు అవార్డు వచ్చిందన్నారు. అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్ భవనం నిర్మాణానికి బెస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండ్ ఆఫీసెస్ క్యాటగిరిలో అత్యుత్తమ అవార్డును కృష్ణా విశ్వ విద్యాలయంకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డును ఈ నెల 12వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు తెలిపారు. ఇన్‌ఛార్జ్ వీసీగా బాధ్యతలు స్వీకరించిన సుందరకృష్ణను రిజిష్టార్ డా. ఎన్ ఉషతో పాటు పలువురు ఆచార్యులు, సహాయాచార్యులు, విశ్వవిద్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఏసీబీకి అడిషనల్ ఎస్పీగా
సాయికృష్ణ బదిలీ

మచిలీపట్నం, జూలై 11: జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ బదిలీ అయ్యారు. ఆయన్ని ఎసీబీకి అటాచ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీగా సాయికృష్ణ 2017 ఆగస్టు 23వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎఎస్పీ సాయికృష్ణ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో కృషి చేశారు. గత ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ప్రస్తుత ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ డివిజన్, సర్కిల్ అధికారులను సమన్వయపర్చుకుంటూ విధులు నిర్వహించారు. బదిలీ అయిన ఎఎస్పీ సాయికృష్ణ గురువారం రిలీవ్ అయ్యారు. అయితే ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.