కృష్ణ

చిట్టచివరి భూముల వరకు సాగునీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగుచేసుకోవడానికి కాలువ చిట్టచివరి భూముల వరకు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం కృష్ణాజిల్లాలోని కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుండి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కేఈ కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి ఉదయం 9.47 గంటలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈసారి వర్షాలు సకాలంలో పడకపోవడం గోదావరికి వరద కూడా ఆలస్యం కావడంతో కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాబోయే 10 రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ గోదావరికి వరద రావడంతో గోదావరి సిస్టంలోని 23 పంపులు ఆన్‌చేసి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. కృష్ణాడెల్టాకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, 80 టీఎంసీలు గోదావరి నుండి 60 టీఎంసీలు పులిచింతల నాగార్జునసాగర్ నుండి మిగిలినవి మునేరు ఇతర నీటి వనరుల నుండి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ సంతోష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ 2 పీ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
జనరంజక బడ్జెట్!

జగ్గయ్యపేట, జూలై 12: అన్ని వర్గాలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం బడ్జెట్‌పై స్థానిక పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అన్నదాతకు పెద్దపీట వేస్తు ఆర్థిక శాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌లో ప్రవేశపెట్టారన్నారు. అమ్మఒడి, వైఎస్‌ఆర్ రైతు భరోసా, పేదల గృహ నిర్మాణాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, వైద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. రైతు సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ కోసం 3వేల కోట్లు కేటాయించారని, ప్రకృతి విపత్తుల నివారణ నిధికి 2వేల రెండు కోట్లు, వైఎస్‌ఆర్ రైతు భరోసాకు 8,750 కోట్లు, 9 గంటల ఉచిత విద్యుత్‌కు 4,525 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 20,677 కోట్లు, ఇలా రైతు సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయడమే కాక ఇచ్చిన హామీల మేరకు అన్ని కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించారని సామినేని అన్నారు.