కృష్ణ

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి తగ్గిన ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ప్రాధాన్యతలు తగ్గించారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్ విమర్శించారు. వ్యవసాయరంగానికి 67శాతం నిధులు పెంచామంటూ సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిగా ప్రాధాన్యత తగ్గించటం దురదృష్టకరమన్నారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రూ. 2,27,975 కోట్ల భారీ బడ్జెట్‌లో 60శాతం మంది ప్రజలు ఆధారపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచే వ్యవసాయరంగానికి కేటాయించిన నిధులు కేవలం రూ. 20,667.05 కోట్లు మాత్రమే కేవలం 9శాతం నిధులు కేటాయించి గొప్పులు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. అదే విధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విత్తనాల సబ్సిడీకి కేవలం రూ.200కోట్లు కేటాయించడం సరిపోదన్నారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 4,5 విడతల రుణమాఫీ నిధులు కేటాయించకుండా రాజకీయ కారణాలతో విస్మరించడం దారుణమన్నారు.
నీటి పారుదదల రంగానికి కోతలు
వ్యవసాయ రంగానికి భారీగా 67శాతం కేటాయింపులు పెంచామని, గత బడ్జెట్‌లో రూ.12,355కోట్లు కేటాయించితే ఈ బడ్జెట్‌లో రూ. 20,677 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారేగానీ, వ్యవసాయానికి కీలకమైన నీటిపారుదల శాఖకు మాత్రం 22.61 శాతం నిధుల కోత విధించటం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. నీటిపారుదలకు గత బడ్జెట్‌లో రూ. 16,978 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ. 13,139 కోట్లు కేటాయించారని, ఈ స్థితిలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేయటానికి ఈ నిధులు ఏమూలకు సరిపోతాయన్నారు.
నవరత్నాలకే పరిమితమైన బడ్జెట్
వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లో పూర్తిగా నవరత్నాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. నిరుద్యోగ భృతి రద్దు చేయడం యువతను నిరుత్సాహానికి గురి చేస్తుందన్నారు. రైతు భరోసాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానితో కలిపి రూ. 18,500లు ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీ 4, 5 విడదల బకాయిలు, పంట రుణాలు, వడ్డీ మాఫీకి కేటాయింపులు చేయాలని, కౌలు రైతులను గ్రామ సభల ద్వారా గుర్తించి సకాలంలో రుణాలు అందేలా చూడాలన్నారు.
నేల విడిచి సాము చేసినట్లుగా బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ నేల విడిచి సాము చేసినట్లుగా పిట్టలదొర కోతల బడ్జెట్‌లా ఉందని ప్రదేశ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసీరెడ్డి విమర్శించారు. కేటాయింపులకు తగ్గట్లు ఆదాయం వచ్చేలా లేదని దీంతో వివిధ రంగాల్లో మున్ముందు కోతలు తప్పవన్నారు. అసరా పథకం కింద పొదుపు సంఘాల వారికి రూ. 27,168 కోట్లు చెల్లించాల్సి ఉంటే బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదన్నారు. రైతురుణ మాఫీ పథకం కింద పెండింగ్‌లో నున్న రూ. 8,353 ప్రస్తావన లేదన్నారు. సాగునీటి రంగానికి అరకొర నిధులు, దీని వల్ల ముఖ్యంగా పోలవరం ఇప్పట్లో పూర్తి కాదన్నారు.

ఇక ప్రతి మూడో శుక్రవారం
విద్యుత్ సంస్థల్లో గ్రీవెన్స్‌డే
* ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు

విజయవాడ, జూలై 12: విద్యుత్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా 3వ శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో గ్రీవెన్స్ డేను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని విద్యుత్ సౌధతోపాటు విశాఖపట్నం, కడప జోన్ల పరిధిలోని ప్రధాన కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆయా సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, సూపరిటెండెంట్ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ డే శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.