కృష్ణ

ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సామాజిక బాధ్యతలను నిర్వర్తించటంతో పాటు చట్టాలను కచ్చితంగా అమలు చేసి బాలికలకు రక్షణగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలిక రక్షణపై జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్య, జనాభాలో స్ర్తి నిష్పత్తిని పెంచడం, చట్టాల అమలుతో బాలికల రక్షణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను నిరోధించడం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. అప్పుడే బాలికలకు రక్షణ కల్పించిన వారమవుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సాంఘిక దురాచారాలు జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. బాలిక రక్షణకై విద్య, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన కల్పించడం, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు లోపు బాలికలకు వివాహాలు జరిపే వారిపై రెవెన్యూ, పోలీసు, స్ర్తి శిశు సంక్షేమ శాఖాధికారులు నిఘా ఉంచాలన్నారు. 14 సంవత్సరాల లోపు బాలికలు విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో బాలికలకు ఆత్మ రక్షణకై కరాటే, కుంగ్‌ఫూ వంటి వాటిపై శిక్షణ ఇవ్వాలన్నారు. బాల్య వివాహ నిరోధక చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మండల, డివిజన్ స్థాయిలో టాస్క్ఫోర్స్ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఆడ పిల్లలు పుట్టడం శుభ పరిణామమని, ఆడ పిల్లల వివాహాలను ఆర్భాటం లేకుండా నిర్వహించడం, సామూహిక వివాహాలు నిర్వహించడం ద్వారా బాలికల రక్షణ సాధ్యపడుతుందన్నారు. ఆడ పిల్లలను రక్షిద్దాం.. ఆడ పిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ముద్రించిన స్టిక్కర్లు, గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జేసీ-2 పిడుగు బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ముడా వీసీ విల్సన్‌బాబు, ఐసీడీఎస్ పీడీ కె కృష్ణకుమారి, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.