కృష్ణ

విద్యారంగంలో గుణాత్మక మార్పు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్) : పాఠశాల విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు ఆగస్టులోపు పంపిణీ చేయాలని, మెటీరియల్‌ను సెప్టెంబర్ 15లోపు అందజేయాలని ఆప్కో, ఎస్‌ఎస్‌ఏ అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పిల్లలకు గుణాత్మక, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించడానికే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టామన్నారు. వౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, మాతృభాష వికాసం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు, పాదరక్షలు, నైపుణ్యాభివృద్ధి, ఫీజు రెగ్యులేటరీ కమిషన్, పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం అనే విద్యా నవరత్నాలు అమలు పరచడానికి అందరూ కృషి చేయాలన్నారు. రాబోయే రెండేళ్లలో విద్యారంగంలో, వౌలిక వసతుల కల్పనలో గుణాత్మక మార్పును తీసుకొచ్చేలా అధికారులంతా కృషి చేయాలన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే ఆశించిన మార్పు తీసుకురావడం కోసం పటిష్ట ప్రణాళిక, సృజనాత్మక ఆలోచనలతో పనిచేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దాదాపు రూ.33వేల కోట్లు విద్యారంగానికి కేటాయించారని, అందులో అమ్మఒడి కోసం రూ.6,456 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏ విభాగమైనా పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితంగా ఉండాలని సీఎం కోరుకుంటున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. అనంతరం ఎస్‌ఎస్‌ఏ రూపొందించిన మాండలిక పాఠ్యపుస్తకాలు విడుదల చేశారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వాడ్రేపు చినవీరభద్రుడు, ఏఎస్పీడీ టీ సూర్యనారాయణ, చీఫ్ ఇంజినీర్ కె శ్రీనివాసరావు, ఆప్కో ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల భూముల్లో ఆక్రమణలు
* కేసుల పరిష్కారం తరువాత క్రమబద్ధీకరణకు చర్యలు * శాసనసభలో మంత్రి వెలంపల్లి హామీ

విజయవాడ, జూలై 16: ఆలయాల భూముల ఆక్రమణలు, క్రమబద్ధీకరణ అంశాల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నాయని, ఆయా కేసుల పరిష్కారం తర్వాత ఈవిషయమై తగిన చర్యలు తీసుకుంటామని దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, ఎ గణేష్‌కుమార్, పీజీవీఆర్ నాయుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 419 ఎకరాల ఆలయ భూముల్లో 12,280 కుటుంబాల వారు నివసిస్తున్నారని, ప్రజలే దేవుళ్లని గుర్తించి దేవుని భూముల పంపిణీకీ వెనుకాడవద్దన్నారు. చంద్రబాబు హయాంలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు కసరత్తు చేశారని, ప్రత్యామ్నాయంగా రెగ్యులరైజేషన్ ఫీజు ద్వారా వచ్చిన సొమ్ము భగవంతునికి చెందేలా జీవో కూడా జారీ చేశారన్నారు. వైసీపీ సభ్యుడు అదిప్‌రాజ్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే గత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. ఐదేళ్లు నిద్దురపోయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే సమయంలో చంద్రబాబు జీవో జారీ చేశారన్నారు. మంత్రి వెలంపల్లి స్పందిస్తూ చంద్రబాబు గతంలో కింది అధికారుల నుంచి నివేదిక తీసుకోకుండా లోపభూయిష్టంగా ప్రజలను మభ్య పెట్టేందుకు ఎన్నికల సమయంలో ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శించారు. శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ గత ఐదేళ్లలో జారీ అయిన జీవోలన్నీ ఉత్తుత్తి జీవోలని విమర్శించారు. స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ కాలయాపన చేశారని, విజయవాడలోనే వేలాది మంది పట్టాదారులు తమ అవసరాల కోసం తాకట్టుపై రుణాలు తెచ్చుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.