కృష్ణ

నాలుగు సబ్ డివిజన్లకు డీఎస్పీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు సబ్ డివిజన్‌లకు డీఎస్పీల నియామకం జరిగింది. అవనిగడ్డ డీఎస్పీగా రమేష్ రెడ్డి, నూజివీడు డీఎస్పీగా బి శ్రీనివాసులు, గుడివాడ డీఎస్పీగా ఎన్ సత్యానందం, నందిగామ డీఎస్పీగా జివి రమణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28వ తేదీన ఈ నాలుగు సబ్ డివిజన్‌లలో పని చేస్తున్న డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే అప్పటి నుండి ఈ సబ్ డివిజన్‌ల పరిధిలో ఎవ్వరినీ నియమించలేదు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది డీస్పీల బదిలీలు జరగ్గా ఈ నాలుగు సబ్ డివిజన్లకు డీఎస్పీలను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు డీటీసీ డీఎస్పీగా పని చేస్తున్న ఎం రమేష్ రెడ్డిని అవనిగడ్డకు, సీఐడీ డీఎస్పీగా పని చేస్తున్న ఎన్ సత్యానందంను గుడివాడ డీఎస్పీగా, శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీగా పని చేస్తున్న బి శ్రీనివాసులును నూజివీడు డీఎస్పీగా, విజయవాడ సౌత్ డీసీపీగా పని చేస్తున్న జివి రమణమూర్తిని నందిగామ డీఎస్పీగా నియమించారు.
వీఓఏల రాజకీయ తొలగింపులు మానుకోండి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జూన్ 16: వీఓఎల రాజకీయ తొలగింపులు వెంటనే ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీఓఎ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీఓఎలపై రాజకీయ తొలగింపులు వెంటనే ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీఎఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు యం రజిని, గౌరవాధ్యక్షురాలు ఎ కమల, సీఐటీయు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.

మహిషాసురమర్థినికి ప్రత్యేక పూజలు
మచిలీపట్నం (కల్చరల్), జూలై 16: స్థానిక గాంధీ బొమ్మ శివాలయంలో ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని మహిషాసురమర్ధిని అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, శివునకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 121 కలశాలతో నిర్వహించిన కుంకుమార్చనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చేబ్రోలు సాయిరాం నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను పాలకవర్గ సభ్యులు కొల్లిపర బాలాజీ దుర్గాప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు.