కృష్ణ

సిఫార్సులతోనే ‘వలంటీర్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో గ్రామ వంలటీర్ల పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఇకపై గ్రామ వలంటీర్లు కీలకం కానున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను తెర మీదకు తీసుకు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజైన ఆగస్టు 15వ తేదీ నుండి గ్రామ వలంటీర్ల సేవలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 14వేల గ్రామ వలంటీర్ల పోస్టులకు గాను 59 వేల మంది పైబడి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు ఈ పోస్టుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా గ్రామ వలంటీర్లకై సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ వలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీ నేతలు కూడా గ్రామాల వారీగా, వార్డుల వారీగా తమకు అనుకూలమైన వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూలు పేరుకు మాత్రమే అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్న వారికే వలంటీర్ల ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో దరఖాస్తుదారులంతా తమ తమ స్థాయిలో అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రతి రోజూ వారి చుట్టూ తిరుగుతూ తమ పేరు వచ్చేలా చూడాల్సిందిగా కోరుతున్నారు. కొంత మంది అయితే ప్రజా ప్రతినిథుల సిఫార్సుల లేఖలు కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. సిఫార్సు లేఖలు ఇవ్వడం వల్ల అల్లరి అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు తమ అనుయాయుల పేర్లను సెలక్షన్ కమిటీ ముందు అనధికారికంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం, అధికారులు మాత్రం వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని తొలి నుండి చెబుతూనే ఉంది. కానీ తెర వెనుక మాత్రం వలంటీర్ల ఎంపికకై సిఫార్సుల ప్రక్రియ కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.