కృష్ణ

నిష్పక్షపాతంగా కేసుల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : కేసుల విచారణలో అత్యంత నిస్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాధ్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం నేర సమీక్షా సమావేశం (క్రైం మీటింగ్) నిర్వహించారు. బందరు, గుడివాడ సబ్ డివిజన్‌లకు సంబంధించిన పోలీసు అధికారులతో భేటీ అయి సర్కిళ్ల వారీగా కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు జరుగుతున్న తీరు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు స్టేషన్లలో ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందనలో వచ్చే అర్జీలతో పాటు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. నిర్ధేశించిన సమయంలో స్పందన అర్జీలను పరిష్కరించాలన్నారు. స్టేషన్‌లలో రికార్డు, రిసెప్షన్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలన్నారు. ఏ సందర్భంలోనైనా తాను స్టేషన్‌ల తనిఖీలు చేపడతానన్నారు. తనిఖీల సమయంలో ఏ చిన్నపాటి లోపం ఉన్నా సహించేది లేదన్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలన్నారు. పోలీసు స్టేషన్‌లను మరింత నవీకరించాలన్నారు. పార్ట్ 1 నుండి పార్ట్ 5 వరకు, ఆ తర్వాత ఇతర రికార్డులను సక్రమంగా నవీకరణ చేయాలన్నారు. 2019 ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను విలేజ్ హిస్టరీ షీట్లలో నమోదు చేయాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో క్రైం ప్రాపర్టీ, ప్రభుత్వ పాపర్టీ రిజిష్టర్లను నిర్వహించాలచాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్‌ఐలు కృష్ణంరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బందరులో భారీ వర్షం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 18: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో అడుగు మేర వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా ధర్మేంద్ర

మచిలీపట్నం, జూలై 18: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా కె ధర్మేంద్ర నియమితులయ్యారు. ఇప్పటి వరకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వర్తించిన వి ఉమామహేశ్వరరావును హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. ధర్మేంద్ర గతంలో మచిలీపట్నంలోని ఆర్‌పేట ఎస్‌ఐగా సేవలు అందించటంతో పాటు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ముందు జిల్లా సీసీఎస్ డీఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పని చేస్తూ జిల్లాకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా బదిలీపై రానున్నారు.