కృష్ణ

బంగారు దుకాణాల బంద్‌కు తాత్కలిక బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 5: కేంద్ర ప్రభుత్వం బంగారపు దుకాణాలపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకానికి నిరసనగా దుకాణాలు మూసి వేసి బంద్ చేస్తున్న వ్యాపారస్తులు బుధవారం నుండి దుకాణాలు తెరవనున్నారు. తాత్కలికంగా బంద్ ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పసిడి దుకాణాలను వర్తకులు తెరిచి వ్యాపారాలు చేయనున్నారు. జాతీయ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఉగాది, ఈ రంగంలో నెలకొన్న సంక్షోభం, తదితర వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ బంద్‌కు తాత్కలికంగా స్వస్తి పలకానే ఉద్దేశంతో రాష్ట్ర అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కృష్ణా జిల్లాలోని ఉన్న బంగారపు దుకాణాలు బుధవారం నుండి తెరవనున్నారు.