కృష్ణ

‘పట్టిసీమ’ లేకపోతే నీళ్లేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ లేకుంటే నేడు డెల్టాకు నీరు వచ్చే పరిస్థితి ఉండేది కాదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పట్టిసీమ నీళ్లు బందరు మండలం సీతారామపురం గ్రామానికి చేరుకోవటంతో గురువారం ఆ నీటికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మూడు సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు తీసేస్తామంటూ అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వీరి తీరు చూస్తుంటే ప్రజా సంక్షేమం పట్ల వీరికెంత శ్రద్ధ ఉందో తెలుస్తోందన్నారు. ఎన్నో వేల ఎకరాలను పట్టిసీమ ప్రాజెక్టు సస్యశ్యామలం చేసిందన్నారు. అటువంటి ప్రాజెక్ట్‌ను విమర్శించడం గర్హనీయమన్నారు. నాడు ప్రతిపక్షంలోనూ, నేడు అధికార పక్షంలోనూ పట్టిసీమను విమర్శించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు. నవరత్నాల్లో భాగంగా జగన్ ప్రకటించిన అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థులందరికీ వర్తింప చేయాలన్నారు. కేవలం తల్లులను ఆధారంగా చేసుకుని ఈ పథకాన్ని అమలు చేయడం సరైనది కాదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కించపరిచే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌తో సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు. ఇటువంటి సంప్రదాయాన్ని తాము ఎప్పుడూ అవలంభించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి టీడీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగాయన్నారు. అలాగే రాష్ట్రం తిరోగమ పథంలో పయనిస్తోందని, దీనికి కరెంటు కోతలే నిదర్శనమన్నారు. మచిలీపట్నంలో ఓ దళిత మహిళను వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చారన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. వారికి ఏ కష్టమొచ్చినా ముందుండి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బచ్చుల శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ ఎఎంసీ చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ బందరు మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు.