కృష్ణ

మంచినీటి పైపులైను లీకును అరికట్టేందుకు శాశ్వత చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : గత ఐదేళ్ల కాలంలో నగరంలోని అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు ఎటువంటి అభివృద్ధి చేయలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు వి మర్శించారు. తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె నియోజకవర్గంలో చేసిన ఒక్క అభివృద్ధి పనై నా చెప్పగలరా అని ప్రశ్నించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ని అనుబంధ సంఘాల కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీసీ సెల్ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొ సగాని దుర్గారావు, స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరె డ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తోకల శ్యాంకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు ఎ మ్మెల్యే గద్దె ఇటీవల మాట్లాడుతూ డైనే జీ, శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారన్నారు. పాలన కూడా గాలకొదిలేశారని వ్యాఖ్యానించారన్న వారు, గడిచిన ఐదు సంవత్సరాలు గద్దె ఎమ్మెల్యేగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. రాష్ట్రంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా గద్దెనే కొనసాగుతున్నారని తెలిపారు. అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో శానిటేషన్, డ్రైనేజీలు వాళ్ల ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని గద్దె రామ్మోహన్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. తాజాగా ఎమ్మెల్యే గద్దె పర్యటించిన 10, 11 డివిజన్లలో టీడీపీ కార్పొరేటర్లే ఉన్నారని, మీ అసమర్థత, మీ కార్పొరేటర్ చేతకానితనాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎదుటివారిపై బురద జల్లే కంటే ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటి శాసనసభా సమావేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దేవాలయాలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గీయులు హర్షించే విధంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మాటకు కట్టుబడి ఉన్నందున నేడు న్యాయం చేశారన్నారు. మొదటి శాసనసభ సమావేశాల్లోనే ఈ నిర్ణయాన్ని అమలుచేసి చూపించారన్నారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎంతో హర్షిస్తున్నారని గుర్తు చేశారు. ఈ వర్గాల పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి, ప్రేమ అర్థమవుతోందన్నారు.