కృష్ణ

రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ : నందిగామ ప్రాంత మెట్ట రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వారంలో రెండు పర్యాయాలు వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. గత నెల నుండి సరైన వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన రైతాంగం వర్షం కోసం ఎదురుతెన్నులు చూశారు. కొందరు కొద్దిపాటి వర్షానికి విత్తనాలు వేయగా మొలకలు వచ్చాయి. వర్షం కారణంగా భూమి పదను కావడంతో పత్తి విత్తనాలు వేశారు. గతంలో సాళ్లు దున్నిన పొలాల్లో విత్తనాలు నాటారు. అదును దాటడంతో పెసర, మినుము పంట సాగు చేయలేదు. మునే్నరు. కృష్ణానది, వాగులు, చెరువులకు నీరు వస్తే వాటి ఆయకట్టులో వరి సాగు చేసే అవకాశం ఉంది. ఎత్తిపోతల పథకాలు, బోర్ల కింద కొందరు రైతులు వరి నారుముడులు పోశారు.

ఆటో ట్రాలీ దగ్ధం
నందిగామ, జూలై 21: జాతీయ రహదారిపై నందిగామ మండలం ఐతవరం సమీపంలో ఆటో ట్రాలీ దగ్ధం అయిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం ఐతవరం గ్రామానికి చెందిన ఎల్ వెంకయ్య కీసర నుండి ఆటో ట్రాలీలో సిమెంట్ బల్లలు వేసుకొని స్వగ్రామానికి వెళుతుండగా గ్రామ సమీపానికి రాగానే ఆటో ట్రాలీ ఇంజన్ నుండి మంటలు రావడం గమనించాడు. దీంతో వెంటనే వాహనాన్ని పక్కన నిలుపులదల చేశాడు. మంటలు ఒక్క సారిగా ఎగిసి పడి మొత్తం ఆటో ధగ్ధం అయ్యింది. విషయం తెలిసి నందిగామ ఫైర్ స్టేషన్ అధికారి రమేష్ సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.