కృష్ణ

అవగాహనతోనే లక్ష్య సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : నిర్దేశించుకున్న సాధించాలంటే దానికి సంబంధించిన అవగాహన ఎంతో ముఖ్యమని కేంద్ర రక్షణశాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలలత చెప్పారు. విద్యార్ధులు లక్ష్యాలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం స్థానిక ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ఉత్తమ ఫలితాలతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. సంకల్పబలం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించ వచ్చని చెప్పారు. ముఖ్యంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థినీ విద్యార్థులు వార్తాపత్రికలను చదవాలని అన్నారు. వీటి ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు. చిన్నతనం నుండి తనకు పరీక్షలు అంటే బయం ఉండేదని, అయితే పట్టుదలతో ఏదైన సాధించవచ్చనే లక్ష్యంతో అంగవైకల్యాన్ని కూడా అధిగమించానని ఆమె తెలిపారు. స్వయం కృషి, పట్టుదల వల్లే తాను నేడు ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధులకు ఈసందర్భంగా పలు సూచనలు చేశారు. న్యాయమూర్తి చంద్రవౌళీశ్వరీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని చెప్పారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వీటిని విద్యార్ధులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు ప్రవేశం కల్పించే విధంగా వీటిని ఏర్పాటు చేశారని అన్నారు. పలు చట్టాలను న్యాయమూర్తి చంద్రవౌళీశ్వరీ విద్యార్దులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డి సూర్యచంద్రరావు, డీన్ నాగార్జున దేవీ, ట్రిపుల్ ఐటీ ప్రతినిధి పావనీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రక్షణశాఖ డీడీ బాల లతను ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఘనంగా సత్కరించారు.