కృష్ణ

అర్హులందరికీ సొంత ఇళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ : కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందజేసి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. ఆదివారం స్థానిక సత్యనారాయణపురంలోని జీవీఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుడివాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రికల్ పనులు చేసే కార్మికులు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. సమాజంలో అందరికీ విద్యుత్ వెలుగులు నింపే వీరి జీవన ప్రమాణాలు ఆర్ధికంగా మరింత బలోపేతం కావాలన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25లక్షల ఇళ్ళపట్టాలను మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. 2020సంవత్సరం నుండి ప్రతి ఏటా సుమారు రూ. 7లక్షల ఇళ్ళను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పట్టణంలో జీప్లస్-3, గ్రామీణ ప్రాంతాల్లో కేటాయించిన స్థలాల్లో ఇళ్ళను నిర్మాణం చేసి ఇస్తామన్నారు. అమ్మ ఒడి పథకం కింద పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల తల్లులకు రూ.15వేలు అందిస్తామన్నారు. ఇంటర్ నుండి మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలకు రూ.20వేలు ఇస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ.12,500లు అందజేస్తామన్నారు. 45సంవత్సరాలు నిండిన వారికి వైఎస్సార్ ఆసరాగా రూ.18,720లను ఆర్ధిక సాయంగా అందజేస్తామన్నారు. 60సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం థర్మల్ పవర్ కోసం జరిపిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల నేడు ఏటా రూ.12వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. అసోసియేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించి భవనాన్ని కూడా నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 4లక్షల మంది కార్మికులు ప్రైవేట్‌గా ఎలక్ట్రికల్ పనులు చేసుకుని జీవిస్తున్నారని, వారి జీవన భృతికి చేయూతనందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో మాట్లాడతానన్నారు. అనంతరం యూనియన్ నాయకులు మంత్రి కొడాలి నానిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు టీ పెదనాగేశ్వరరావు, కార్యదర్శి కంచర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.