కృష్ణ

రేషన్ డీలర్లను తొలగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్రంలో వలంటీర్‌ల వ్యవస్థ వచ్చినంత మాత్రాన దశాబ్దాలుగా పని చేస్తున్న 30వేల మంది చౌకడిపో డీలర్‌లను అర్ధంతరంగా తొలగించాలన్న యోచన ప్రభుత్వానికి లేదని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. జనసేన సభ్యుడు రాపాక వరప్రసాదరావు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా రేషన్‌డీలర్లను తొలగిస్తున్నారనే ప్రచారం సాగిస్తున్నారని మంత్రి అన్నారు. గతంలో వారి హయాంలో తాను ప్రాతినిధ్యం వహించే గుడివాడ నియోజకవర్గంలోనే ఒకే సారి 42 మంది డీలర్‌లను ఏకపక్షంగా తొలగించి వారి స్థానంలో పచ్చచొక్కాల వారిని నియమించారన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి ఎంతో దండుకున్నారన్నారు. నాటి ఘటనపై కూడా విచారణ జరిపించి నిర్దోషులైన డీలర్లపై ఉన్న కేసులన్నింటినీ తొలగిస్తామన్నారు. తమ ముఖ్యమంత్రి జగన్ పది మందికి ఉపాధి కల్పిస్తారు మినహా నోటి వద్ద కూడు తీయరని స్పష్టం చేశారు. డీలర్లను స్టాకిస్ట్‌లుగా మారుస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గత ఐదేళ్లలో బోగస్ రేషన్‌కార్డులు కుప్పలు తెప్పలుగా వచ్చాయని చెప్పగా మంత్రి బదులిస్తూ డీలర్‌లు తామంతట తాముగా వారి వద్ద నున్న కార్డులు అప్పగిస్తే సరి, లేకపోతే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామన్నారు. సెప్టెంబర్ తరువాత కొత్తకార్డులు జారీ చేస్తామన్నారు. విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, మరికొన్ని పథకాలు రేషన్‌కార్డుతో ముడిపడి ఉన్నందున రేషన్‌కార్డులకు డిమాండ్ పెరిగిందని, అందుకే దారిద్య్రరేఖ దిగువనున్న వారికి వేరుగా సబ్సిడీ సరుకులు తీసుకునే విధంగా ప్రత్యేక రేషన్‌కార్డులు ఇవ్వాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత సర్వే జరిపించి సరికొత్త రేషన్‌కార్డులను అమల్లోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సైతం ఈ రేషన్‌కార్డుల సమస్య రాష్ట్ర మంతటా ఉందని తక్షణం ఓ పరిష్కార మార్గం కనుగొనాలన్నారు.